(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మీకు ఇష్టమైన జట్ల మధ్య జరిగే క్రికెట్, ఫుట్‌బాల్ లాంటి మ్యాచ్‌లు చూడడానికి మీరు ఇంటి దగ్గర భార్యను వదిలిపెట్టి గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళుతున్నారా. అయితే మధ్యలో గర్ల్ ప్రెండ్‌ను ముద్దు పెట్టుకోవడం వంటి సరసాలకు దిగొద్దు. ఎందుకంటే గేము లైవ్ ఇస్తున్న కెమేరా ఆ క్షణంలో మీ మీద ఫోకస్ అవ్వవచ్చు. ఇంటి దగ్గర మీ భార్య టివి ఎదురుగా కూర్చుని అదే గేము చూస్తున్నదనుకోండి. మీ కొంప కొల్లేరే.
ఈక్వెడార్‌లో ఒక లవర్‌కు ఇదే అనుభవంలోకి వచ్చింది. బార్సిలోనా ఎస్సి – డెల్పిన్ జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌కు గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లాడు డేవీ యాండ్రాడీ అనే యువకుడు. మధ్యలో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. తమపై కెమెరా ఫోకస్ అయిందని గ్రహించే సరికే లేటు అయింది. ఆమెను వదిలిపెట్టి ఇబ్బందిగా కూర్చున్నాడు. అతను ఎవరో ఏమిటో తెలియకపోయినా నెటిజెన్లు సంగతి పట్టేశారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది.
When you kiss your girlfriend, then realise you’re on tv and your wife could be watching ?
pic.twitter.com/ifkvJGuwen— Football Mumble (@football_mumble) January 19, 2020
ఈ ఒక్క తప్పు కాయాల్సిందిగా డేవీ తన నిజమై సహచరిని వేడుకుంటూ ఫేస్బుక్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన తర్వాత అందరికీ అసలు విషయం తెలిసింది. తప్పు తెలుసుకుని బహిరంగంగా ఒప్పుకుంటున్నాను. నీతో గడిపిన క్షణాల మళ్లీ నాకు కావాలి అని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో సహచరిని వేడుకున్నాడు. తన గుట్టు రట్టు చేసినందుకు నెటిజెన్లపై అతను ఫేస్బుక్లో నా కొంప కొల్లేరు చేశారంటూ అతను ఆక్రోశం వెళ్లగక్కాడు.
https://www.instagram.com/p/B7hILyllCsI/