సఫ్దర్ హష్మీ హల్లా బోల్ వీధి నాటకం
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కళాకారుడు, వామపక్ష నాటక ప్రయోక్త సఫ్దర్ హష్మీ 1889 జనవరి ఒకటవ తేదీన ఘజియాబాద్‌లో హల్లా బోల్ వీధి నాటకం ఆడుతుండగా కాంగ్రెస్ గూండాలు పాశవికంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన హష్మీ మరుసటి రోజు మరణించాడు.
ఆ తర్వాత వారం రోజులకు ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మీ 12వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ వేదిక నుంచి హష్మీ హత్యను బహిరంగంగా నిరసించింది. హష్మీ హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు హెచ్‌కెఎల్ భగత్ ముందు వరసలో కూర్చొని ఉండగా, నటులు కబీర్ బేడీ, విక్టర్ బెనర్జీ సరసన నుంచుని ఉండగా ఆమె తన నిరసన ప్రకటన చదివింది.
When Bollywood had a SPINE!!!
Jan 10th 1989 : A week after Safdar Hashmi's death, Shabana Azmi protested his killing on the stage of 12th International Film Festival, while Congress leader HKL Bhagat (accussed in the killing) was sitting in the front row of the audience. https://t.co/GqXWgzrFjt
— Advaid അദ്വൈത് (@Advaidism) January 1, 2020
ఇప్పుడా వీడియో బయటకు వచ్చింది. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులపై పోలీసులు దమనకాండకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా బాలీవుడ్ ప్రముఖులు నోరు మెదపకపోవడం చాలా విమర్శలకు దారి తీసింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అధికారుల అండదండలతో ముసుగుమనుషులు విద్యార్ధులపై దాడి చేసిన అనంతరం నటి దీపికా పదుకోనే అక్కడకు వెళ్లి బాధితులకు తన సంఘీభావం ప్రకటించారు. అందుకు బిజెపి వారు ఆమెపై మాటల దాడి చేసినాగానీ బాలీవుడ్ కిమ్మనలేదు.
ఈ నేపధ్యంలో అలనాటి షబానా నిరసన వీడియో బయటకు వచ్చింది. నిజానికి ఈ వీడియో రూపొందించిన సందర్భం వేరే ఉంది. హష్మీ జీవితంపై రాసిన ఒక పుస్తకాన్ని మొన్న జనవరి ఒకటిన ఝందాపూర్లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో షబానా పాల్గొన్నది. ఆ సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు. ‘బాలీవుడ్‌కు వెన్నెముక ఉన్న రోజుల్లో’ అంటూ దానిని ట్విట్టర్లో పోస్టు చేశారు. షబానా కూడా దానిని రీట్వీట్ చేసింది.
Remembering #Safdar Hashmi .. pic.twitter.com/MJtWn9V90G
— Azmi Shabana (@AzmiShabana) January 2, 2020