ప్రధానమంత్రి సమక్షంలో వేదికపై సహచర మంత్రిపై వేయరాని చోట చేయి వేసిన త్రిపుర మంత్రి కథ ఇది. ఈ వీడియో వైరల్ కావడంతో త్రిపుర రాష్ట్రంలో గగ్గోలు రేగింది. ఆ మంత్రి పేరు మనోజ్ కాంతి దేబ్. ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష లెఫ్ట్‌ఫ్రంట్ డిమాండ్ చేసింది.
ఈ విషయంపై ఐఎఎన్ఎస్ వార్తాసంస్థ ప్రశ్నించినపుడు మంత్రి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రభుత్వం నడుపుతున్న బిజెపి మాత్రం మంత్రికి వత్తాసు వచ్చింది. లెఫ్ట్ ఫ్రంట్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నబేందు భట్టాచార్జీ వ్యాఖ్యానించారు. మహిళామంత్రి ఫిర్యాదే చేయలేదు. లెఫ్ట్ ఫ్రంట్ చెత్త రాజకీయాలు చేస్తోంది అన్నారాయన.
ప్రధాన మంత్రి శనివారం అగర్తలా వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగించిన బహిరంగసభ వేదికపై ఆ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. మహిళా మంత్రిపై చేయి వేసిన కాంతి దేబ్ ఆ తర్వాత కూడా ఆమె ఇబ్బంది పడేంత సన్నిహితంగా తాకుతూ నుంచున్నారు. ఈ సంఘటనలో బాధితురాలు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శంతన చక్మా గిరిజన నాయకురాలు. ఆమె త్రిపుర ప్రభుత్వంలోని ఏకైక మహిళా మంత్రి. కీచక మంత్రి మనోజ్ కాంతి దేబ్‌పై చర్య తీసుకోవల్సిందేనని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వీడియో కోస కింద క్లిక్ చేయండి.
Modi ji2,9,2019 ku tripura pucha oha
Ek udgatan pe tripura ki #bjpneta ki halat dekiye #santanachakma minister social welfare bar bar inki kamar par hat dalte #manojkantideb minister of youth affairs ek minister honeki bad khud suraksit nahi@abhisar_sharma @dhruv_rathee pic.twitter.com/oc0x2F8Aj8— Zakaria Ahmed زكريا احمد (@zakariaahmed332) February 10, 2019