టాప్ స్టోరీస్

ట్రంప్ ప్రెస్ సెక్రటరీ అయితే ఏంటట!?

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఉత్తర కొరియా సెక్యూరిటీ ముందు అమెరికన్లు తేలిపోయారు. సందర్భం చాలా పెద్దది. కవరేజి అత్యంత ముఖ్యం. కానీ అదంత తేలికగా జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ ఆకస్మిక సమావేశం సందర్బంగా ఈ గొడవ చోటుచేసుకున్నది. ఆఖరికి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీకి కూడా తోపులాట తప్పలేదు. ఆ తోపులాటలో ఆమె చర్మం స్వల్పంగా దోక్కుపోయింది. ఈ తోపులాట పాక్షికంగా వీడియోకు ఎక్కింది.

ఉత్తర కొరియా భూభాగంపై ట్రంప్ కాలుమోపిన చారిత్రాత్మక సంఘటన తర్వాత హౌస్ ఆఫ్ ఫ్రీడంలో ఇద్దరు నాయకులు కలిసి కూర్చునే చోటికి వెళ్లడానికి ప్రయత్నించిన అమెరికన్ జర్నలిస్టులను ఉత్తర కొరియా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. వారిని లోపలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషామ్‌ తోపులాటలో చిక్కుకున్నారు. చచ్చీచెడీ లోపలకు వెళ్లగలిగిన గ్రిషామ్ మొత్తం మీద కొందరు రిపోర్టర్లకు దారి చేశారు. ట్రంప్ భార్య మెలానియాకు రెండేళ్లుగా సమచార విభాగం డైరక్టర్‌గా పని చేస్తున్న గ్రిషామ్ కొద్ది రోజుల క్రితమే ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా చేరారు. ఈమె కూడా తనకు ముందున్న సారా శాండర్స్ లాగా  మీడియాతో అంత సఖ్యతగా ఉండరు. తరచూ మీడియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు.

Video & Photo Courtesy: The Guardian


Share

Related posts

చంద్రబాబుపై కొడాలి ఫైర్

somaraju sharma

బాలాకోట్.. సాక్ష్యాలున్నాయి

Kamesh

హుజూర్‌నగర్‌లో ‘గులాబీ జెండా’

Mahesh

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar