(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన అసమాన ప్రతిభతో కట్టిపడేసిన బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయంట్ ఇక లేడనే వార్త యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే, కోబ్ బ్రయంట్ మరణవార్తను ఓ నెటిజన్ 2012లోనే ఊహించాడు. ఎనిమిదేళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన ఓ పాత ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నోసో అనే పేరుతో ఓ ట్విటర్ యూజర్.. బాస్కెట్‌బాల్ దిగ్గజం హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్ 14న ట్వీట్ చేశాడు. ఇది చూసిన అతడి ఫాలోవర్లు అప్పట్లో నోసోపై మండిపడ్డారు. అయితే ఇపుడు అది నిజం కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Kobe is going to end up dying in a helicopter crash
— .Noso (@dotNoso) November 13, 2012
అయితే ఆ నాటి తన ట్వీట్ కు సోమవారం ఆ నెటిజన్ ఏడేళ్ల నాటి తన ట్వీట్‌కు క్షమాపణలు చెప్పాడు. ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు అని చెప్పడం, హెలికాప్టర్ ప్రమాదం అని కూడా చెప్పడంతో అంతా షాక్ గురవుతున్నారు. అయితే, మరి కొందరు ఇదంతా తప్పుడు వ్యవహారం అని కొట్టిపారేస్తున్నారు. ట్వీట్ లో తేదీ మార్చి ఇలా ప్రచారం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.
Theres no freaking way… 8 years ago someone could have said this… and then 8 years later… having it come true…
— XSET Vrax (@Vraxooo) January 26, 2020
Quick thread for anyone questioning the legitimacy of this tweet: it is real. Here’s some supporting info.
— Mike Beasley (@MikeBeas) January 27, 2020
బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బీన్ బ్రయంట్ (41) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన ఈ ఘటనలో కోబ్, అతడి పదమూడేళ్ల కుమార్తె గియానా సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కోబ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాస్ఏంజెల్స్ పశ్చిమ దిశలోని కాలబసాస్ ప్రాంతంలో ఓ కొండను ఢీకొట్టి మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మంది అగ్నికి ఆహుతయ్యారు.
తన 20 ఏళ్ల అద్వితీయ కెరీర్‌కు 2016లో రిటైర్మెంట్ ప్రకటించాడు కోబ్. అమెరికా జాతీయ జట్టు తరఫున రెండు ఒలింపిక్స్ స్వర్ణాలు (2008, 2012) సాధించారు. ఐదు సార్లు ఎన్బీఏ చాంపియన్, రెండుసార్లు ఎన్బీఏ ఫైనల్స్ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు, నాలుగు సార్లు ఆల్‌స్టార్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎన్బీఏ స్కోరింగ్ చాంపియన్.. ఇలా ఎన్నో ఘనతలను తన పేరిట రాసుకున్నాడు. కోబ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ దాక ప్రపంచంలోని అన్ని దేశాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బ్రయంట్ మృతి పట్ల నివాళులు వెల్లువెత్తుతున్నాయి. బ్రయంట్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వార్త విని క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం బాస్కెట్ బాల్ అభిమానులే కాకుండా క్రీడాకారులు, సెలబ్రెటీలు బ్రయింట్ కు నివాళులు అర్పిస్తున్నారు.
https://twitter.com/mantrakevin/status/1221522879839264771
Plus why is everyone having different date and time for this same tweet? pic.twitter.com/snU9phytiV
— ??? ?????? ?? (@jimngormoh) January 26, 2020