నెల్లూరులో యురేనియం అన్వేషణ

నెల్లూరు: నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో యురేనియం నిక్షేపాల అన్వేషణకు రంగం సిద్ధమవుతున్నది. పటమటి కంబంపాడు అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం తవ్వకాలు చేపట్టనున్నారు. దీని కోసం ఆటోనిక్ ఎనర్జీ సంస్థ నేతృత్వంలో యంత్రాలను అక్కడకు తరలించారు. అయితే ఈ తవ్వకాలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంటపొలాలు, తాగునీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో యురేనియం తవ్వకాలు వద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్కడి నేతలు అఖిలపక్షంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో తవ్వకాలను నిలిపివేసి యంత్రాలను అక్కడ నుండి తరలించారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో యురేనియం కలకలం మొదలైంది. ఇక్కడ కూడా స్థానికులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు.