NewsOrbit
టాప్ స్టోరీస్

యుఎఫ్‌వోను నిర్ధారించిన యుఎస్ నేవీ!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

గ్రహాంతర వాసులు ఉన్నారా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆకాశంలో ఎగిరే పళ్లాలు, గోళాలు కనబడ్డాయన్న వార్తలు కూడా తరచూనే వినబడుతుంటాయి. వాటిలో ఎక్కువ భాగం పట్టించుకోవాల్సినవి కావు. కొన్ని మాత్రం పరిశీలనార్హమైనవి.

అమెరికా నౌకాదళం దగ్గర అలాంటి వీడియోలు కొన్ని ఉన్నాయి. 2017 డిసెంబర్‌లో ఒక యుద్ధ విమానం రికార్డు చేసిన వీడియో వాస్తవమేనని అమెరికా నేవీ ధృవీకరించింది. ఈ గుర్తు తెలియని ఎగిరే వస్తువుల (యుఎఫ్‌వో)ను రికార్డు చేసిన వీడియోలను కొన్నాళ్ల క్రితం అమెరికా నేవీ మిలటరీ రహస్యాల జాబితా నుంచి తొలగించి విడుదల చేసింది. అలాంటి మూడు వీడియోలలో కనబడిన వస్తువులను అమెరికా నేవీ గుర్తు తెలియని ఎగిరే దృగ్విషయం (యుఎపి)గా అభివర్ణించింది.

అత్యాధునిక ఇన్‌ప్రా రెడ్ సెన్సార్స్ ద్వారా రికార్డు చేసిన ఆ వస్తువులు చాలా వేగంగా  ప్రయాణిస్తున్నాయని నేవీ అధికార ప్రతినిధి జో గ్రేడిషర్ తెలిపినట్లు సిఎన్‌ఎన్ రిపోర్టు చేసింది. నేవీ విమానాల పైలట్లు చూసిన ఆ వస్తువులు ఏమిటన్నది మాత్రం తెలియదని మిలటరీ అధికారులు  చెబుతున్నారు.

2004లో నేవీ విమానంలోని ఇన్‌ఫ్రా రెడ్ కెమేరా రికార్డు చేసిన ఒక వీడియోలో విమానం ముందు చాలా వేగంగా వెళుతున్న ఒక యుఎపి సెన్సార్ల వ్యూఫైండర్‌లో లాక్ అవడం కనబడుతుంది. అకస్మాత్తుగా ఆ వస్తువు ఎడమ వైపునకు మళ్లుతుంది. అది ఎంత వేగంగా ఆ పని చేసిందంటే అత్యాధునికమైన ఇన్‌ప్రా రెడ్ సెన్సార్లు దానిని ట్రాక్ చేయడంలో విఫలమయ్యాయి.

మొత్తం మీద అమెరికా నేవీ వీడియోలతో, వాటి తాజా నిర్ధారణతో యుఎఫ్‌వోలపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. విశ్వంలో భూగ్రహం మీది మానవుల లాగా ఇంకెక్కడన్నా తెలివైన జీవులు ఉన్నారేమో తేల్చేందుకు జరిగే అన్వేషణకు కొత్త ఊపు వచ్చింది.

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment