NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గన్నవరం రాజకీయం… వంశీ ధైర్యం ఏమిటో తెలుసా..?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించిన విధంగా పాలనా వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో అమరావతి ప్రాంత రైతాంగం మళ్ళీ రోడ్డు ఎక్కి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతులకు మద్దతుగా..అమరావతి నుండి విశాఖకు రాజధాని తరలించడానికి వీలులేదంటూ టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ఆందోళనకు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో అమరావతి సెంటిమెంట్ బలంగా పనిచేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అని వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు అంతర్మధనంలో పడుతున్నారట. ఈ పరిస్థితిలోనూ తాను వైసీపీ నుండి పోటీ చేసి గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కల్గిస్తుండగా.. వల్లభనేని వంశీ ధైర్యానికి కారణం ఏమిటి? అని కూడా చర్చించుకుంటున్నారు. మరో పక్క టీడీపీ నుండి వైసీపీ, వైసీపీ నుండి టీడీపీ రాజీనామాలు చేసి ప్రజాతీర్పు కోరాలని సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు.

Vallabhaneni vamsi stickon resignation

వైసీపీ ఫ్యాన్ గాలిలోనూ…

వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుండి రెండవ సారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన వైసీపీ ఫ్యాన్ గాలిలోనూ వంశీ టీడీపీ తరపున ఎమ్మెల్యే గా గెలవడం విశేషమే. ఎన్నికల అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ అధికారికంగా పార్టీ కండువా కప్పుకోలేదు కానీ వైసీపీకి గూటికి చేరిపోయారు. ఎన్నికలకు ముందే వంశీని వైసీపీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.

వంశీ గెలుపునకు పకడ్బందీ వ్యూహాలు

వల్లభనేని వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే రెండు రోజుల క్రితం వెల్లడించారు. ఉప ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటి నుండే అయన వ్యూహాన్ని రచించుకున్నట్లు సమాచారం. టీడీపీలోని తన సన్నిహితులు, పాత పరిచయస్తులతో చర్చించడంతో పాటు వైసీపీలో కూడా వర్గ విభేదాలు రాకుండా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తనపై ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు, నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత దట్టు రామచంద్ర రావు వర్గీయుల మద్దతునూ కూడగట్టుకునేందుకు పావులు కదుపుతున్నారు. అర్ధబలం, అంగబలం, అధికార బలం అన్నీ ఉపయోగించుకొని ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని వంశీ అనుకుంటున్నారు. ఆలా జరిగేతే టీడీపీపై మరింత గట్టిగా విమర్శలు చేయడానికి అవకాశం చిక్కుతుందనీ, సీఎం జగన్ వద్ద తన ఇమేజ్ పెరుగుతుందనీ భావిస్తున్నారట వల్లభనేని వంశీ.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju