టాప్ స్టోరీస్

నెత్తిపైనే విమానం ల్యాండింగ్!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అక్కడ విమానం ఎంత కిందగా ల్యాండింగ్ అవుతుందో చూస్తే వళ్లు గగుర్పొడుస్తుంది. గ్రీస్‌లోని స్కియాతోస్ ఎయిర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌ను వీడియో తీసి పోస్టు చేసిందో ఛానల్. శుక్రవారం నుంచి ఇప్పటివరకూ 20 లక్షల మందికి పైగా దానిని చూశారు.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం ఒకటి మరీ తక్కువ ఎత్తులో రన్‌వే  మీదకు వెళ్లడం అందులో కనబడుతుంది. ఎంత తక్కువ ఎత్తులో అంటే కింద నుంచున్నవారు కొందరు చటుక్కున వంగి తప్పించుకోవాల్సినంత. ఒక జంట అయితే జెట్ లోచి దూసుకువచ్చే వేడిగాలి ధాటికి కింద పడ్డారని ద సన్ పత్రిక తెలిపింది.

స్కియాతోస్ విమానాశ్రయం ఈ రకమైన ల్యాండింగ్‌లకు పెట్టింది పేరు. బీచ్‌ను ఆనుకుని ఉంటుంది ఈ విమానాశ్రయం. రన్‌వే మీదకు దూసుకెళ్లే విమానం నడినెత్తి మీదకు వచ్చినపుడు సెల్ఫీ తీసుకోవాలనుకునే సాహస యాత్రికులు ఈ పట్టణానికి వస్తుంటారు. వీడియోను పోస్టు చేసిన కార్గోస్పాటర్ అనే ఛానల్, ఈ విమానాశ్రయం  టూరిస్టులను తెగ ఆకర్షిస్తోందని పేర్కొన్నది.


Share

Related posts

‘మహా’ సంక్షోభం.. ఎన్సీపీది ప్రతిపక్ష పాత్రే!

Mahesh

‘రాజధానితో మూడు ముక్కలాటనా!?’

somaraju sharma

‘మసూద్‌పై నిషేధానికి అగ్రదేశాల పట్టు’

Siva Prasad

Leave a Comment