(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇరాన్లో బుధవారం ఉక్రెయిన్‌కు చెందిన విమానం కూలిపోయిన దుర్ఘటనకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఈ వీడియో ప్రకారం కూలిపోక ముందే విమానంలో మంటలు చెలరేగాయి. మండుతూనే కాస్త దూరం ప్రయాణించిన తర్వాత విమానం కూలిపోగానే పెద్ద అగ్నిగోళంలా విస్ఫోటనం సంభవించడం వీడియోలో కనబడుతుంది.
Video Courtesy: The Telegraph
టెహరాన్ నుంచి ఉక్రెయన్ రాజధాని కీవ్ వెళ్లాల్సిన బోయింగ్ 737 విమానం గాల్లోకి లేచిన కొద్ది సేపటికే కూలిపోయింది. విమానం కూలిపోయి అగ్నిగోళంలా మండిపోయిన దృశ్యాన్ని కొంచెం దూరం నుంచి ఈ వీడియోలో బంధించారు. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయారు.