వైసిపి ఎమ్మెల్యే రజనికి ఊహించని బెదిరింపు

Share

అమరావతి: గుంటూరు జిల్లా చిలకూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడతల రజనీకి ఊహించని ఒక బెదిరింపు వీడియో తలనొప్పిగా మారింది. ఈ నెల 15వ తేదీలోగా తనకు న్యాయం చేయకపోతే భార్య పిల్లలతో సహా గుంటూరు కలెక్టరేట్ వద్దకు వెళ్లి పెట్లోల్ పోసుకుని సూసైడ్ చేసుకుంటామంటూ చిన్న కర్ణి శామ్యూల్ అనే యువకుడు పోస్టు చేసిన వీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తనకు ఎస్‌సి కార్పోరేషన్ ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌ ద్వారా కారు లోను రుణం మంజూరైందని ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన చిన్నకర్ణి శామ్యూల్ తెలుపుతున్నాడు. జూలై ఎనిమిదవ తేదీన కారు డెలివరీకి అధికారులు సిద్ధం చేశారనీ, తనకు మాత్రం కారు ఇవ్వకుండా తనతో పాటు మంజూరైన లబ్దిదారులందరికీ కార్లు డెలివరీ చేశారనీ పేర్కొన్నాడు. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి ఆపించడం వల్లనే తనకు కారు ఇవ్వలేదని శామ్యూల్ ఆరోపిస్తున్నాడు. శామ్యూల్ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నెల 15వ తేదీలోగా ఎమ్మెల్యే రజని ఏదో ఒక న్యాయం చేయాలని లేని పక్షంలో తాను కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు.దీనిపై ఎమ్మెల్యే రజని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

38 seconds ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

9 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago