ముంబై: పెంపుడు కుక్క కోసం కన్నతల్లిపైనే కేసు పెట్టింది ఓ కూతురు. జంతు ప్రేమికురాలైన ఓ కూతురు వీధి కుక్కను ఇంటికి తెచ్చి పెంచుకుంటోంది. అది నచ్చని తల్లి ఒక రోజు ఆ కుక్కను ఇంటి నుంచి తరిమేసింది. ఈ విషయం తెలియక ఎక్కడెక్కడో వెతికిన కూతురు.. చివరికి అసలు విషయం తెలిసి కన్నతల్లిపై కేసు పెట్టింది. ఈ ఘటన ముంబైలోని పంత్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..పంత్ నగర్లో ఉంటున్న స్నేహ నికమ్ అనే 24 ఏళ్ల యువతి ఓ కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుంది. జంతు ప్రేమికురాలైన ఆమె దానికి ‘కుకీ’ అని ముద్దుగా పేరు పెట్టుకుంది. గత సెప్టెంబర్లో ఆ కుక్క పిల్లను ఇంటి గేట్ దగ్గర కట్టేసింది. స్నేహ కొద్దిసేపటి తర్వాత వచ్చి చూస్తే అది అక్కడ కనపడలేదు. ఈ విషయమై తల్లిని అడగ్గా.. ఇప్పుడే విడిచిపెట్టానని చెప్పింది. దీంతో స్నేహ బయటకు వెళ్లి చూసింది. స్నేహాకు ఆ కుక్క ఎక్కడా కానరాలేదు. దీంతో ఇంటికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూసింది. అందులో స్నేహ తల్లి స్వయంగా కుక్కను బయటకు తీసుకెళ్లి వదిలేసి దృశ్యాలను చూసి షాకైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుక్క ఆచూకీ తెలియలేదు. దీంతో స్నేహ తన ఫ్రెండ్ సాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం స్నేహ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను ప్రశ్నిస్తున్నారు.
previous post