న్యూఢిల్లీ: పొట్టి దుస్తులు వేసుకున్నందుకు అమ్మాయిలను రేప్ చేయాలని రెస్టారెంట్లో మగవాళ్లకు చెప్పిన ఓ మధ్యవయస్కురాలికి ఆ అమ్మాయిలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్షమాపణ చెప్పకపోతే వీడియోను వైరల్ చేస్తామని అప్పటికే అమ్మాయిలు ఆ మహిళను గట్టిగా బెదిరించారు.
తాము పొట్టి దుస్తులు వేసుకుని రెస్టారెంటుకు వెళ్లామని, అది నచ్చని ఆ మహిళ రెస్టారెంట్లో ఉన్న ఏడుగురు పురుషులను పిలిచి, తమను రేప్ చేయాలని చెప్పిందని శివానీ గుప్తా అనే యువతి ఫేస్బుక్లో తెలిపారు. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఆ కొట్లాట వీడియోను ఆమె పోస్ట్ చేశారు. తాను, తన స్నేహితులు కలిసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ వరకు ఆ మహిళను తరుముకుని వెళ్లి ఆమెతో క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశామన్నారు. ఇప్పుడు క్షమాపణ చెప్పకపోతే ఆమె జీవితాన్ని నరకప్రాయం చేస్తామని ఆ యువతుల్లో ఒకరు వీడియోలో చెబుతున్నట్లుంది. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ఆ మధ్యవయసు మహిళ అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కొందరు యువతులు ఆమెను అనుసరిస్తూ కెమెరాలతో వెళ్తుండగా మరో మహిళ కూడా వారితో కలిసి మధ్యవయసు మహిళపై మండిపడ్డారు.
దాదాపు ఎనిమిది నిమిషాల వీడియో తర్వాత ఆ మధ్యవయసు మహిళ మాట్లాడారు. హలో గయ్స్, ఈ అమ్మాయిలు అతి చిన్న దుస్తులు వేసుకుని, అంతా వాళ్లవైపే చూసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇది సరైనదేనా? చాలా బాగుంది. ఇలా వీరు మమ్మల్ని రేప్ చేయండంటూ పొట్టి దుస్తులు వేసుకుంటారు, లేదా నగ్నంగా ఉంటారు. మీరు తల్లిదండ్రులైతే ఈ అమ్మాయిలను నియంత్రించండి అని వాళ్ల మొబైల్ ఫోన్ కెమెరాలోకి చూస్తూ చెప్పారు. ఆ మధ్యవయసు మహిళ భాష, యాసను వెక్కిరిస్తూ యువతులు మాట్లాడడం అందులో వినబడుతుంది.
వీడియో ఇక్కడ చూడండి:
https://www.facebook.com/shivani.gupta.31/videos/10156696568474934/?t=0