మతం భగవంతుడికే ఎరుక!

Share

అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్‌గా మాజీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని వైవి సుబ్బారెడ్డిని కాదని టిడిపి నుండి వైసిపిలో చేరిన మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే.

సిఎం జగన్మోహనరెడ్డి బుధవారం రాత్రి వైవి సుబ్బారెడ్డితో భేటీ అయి టిటిడి చైర్మన్ పదవి తీసుకోవాలని చెప్పినట్లు  తెలిసింది. అయితే వైవి రాజ్యసభ నామినేషన్‌కు మొగ్గుచూపినట్లు సమాచారం. అస్తవ్యస్థంగా ఉన్న టిటిడిని ఒక గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందనీ సిఎం జగన్ ఆయనకు నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వం మారిన సందర్భంగా నైతిక బాధ్యత వహించి టిటిడి చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యావద్ రాజీనామా చేస్తారని భావించారు. అయితే రాజీనామాకు ఆయన ససేమిరా అనడంతో త్వరలో ఆర్డినెన్స్ ద్వారా టిటిడితో సహా ఇతర ఆలయాల పాలకవర్గాలను రద్దు చేయాలని నూతన ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ పాలకవర్గాన్ని రద్దు చేసిన వెంటనే టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నారని వైసిపి వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా క్రైస్తవుడైన వైవి సుబ్బారెడ్డికి టిటిడి చైర్మన్ పదవి అప్పగించడం ఏమిటంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్‌లు విమర్శిస్తున్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిటిడి చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌ను నియమించిన సమయంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. పుట్టాకు క్రైస్తవ సంఘాలతో సంబంధాలు ఉన్నాయంటూ నాడు ఆర్‌ఎస్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. క్రైసవ మహసభలకు ఆహ్వానితుడుగా పుట్టా వెళ్లిన సందర్భంలో ఏర్పాటు చేసిన బ్యానర్‌లను నాడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా పుట్టా తాను హిందువునని ప్రకటించుకున్నారు. వివిధ సంఘాలతో పాటు క్రైస్తవ సంఘాలకు విరాళాలు ఇస్తుంటానని ఆ అభిమానంతోనే వారు ప్లెక్సీలపై తన ఫోటో వేసుకున్నారు తప్ప తాను క్రైస్తవ మతం స్వీకరించలేదని చెప్పుకున్నారు.

ఇదే బోర్డులో టిడిపి ఎమ్మెల్యే వంగలపూడి అనితను డైరెక్టర్‌గా నియమించిన సమయంలోనూ వివాదమయ్యింది. తన బ్యాగ్‌లో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని ఒక యూట్యూబ్ ఛానల్‌కు అనిత ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తాను హిందువునేననీ, క్రైస్తవ మతం స్వీకరించలేదని ప్రకటించుకొన్నది. ఆ పదవి తనకు రాకుండా చేయడం కోసం ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వీడియోను ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో స్వచ్చందంగా డైరెక్టర్‌ పదవిని అనిత వదులుకున్నారు.

టిటిడి చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నూతన ప్రభుత్వం నియమించనుందని వార్తలు వెలవడగా గురువారం వికీపిడియాలోని వైవి సుబ్బారెడ్డి బయోడేటాను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ బయోడేటాలో మతం అన్న కాలం వద్ద క్రిష్టియన్ అని ఉండగా కొద్ది సేపటికి తరువాత దాన్ని ఎడిట్ చేశారు.

ఈ వివాదాల నడుమ సిఎం జగన్మోహనరెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

 


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

7 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

8 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

60 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

1 hour ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago