(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సంక్రాంతి సంబరాలు గోదావరి జిల్లాలో ఘనంగా జరిగాయి. అనాధిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా కోడి పుంజులు బరిలోకి దిగి హోరా హోరీగా తలపడ్డాయి. కత్తులు కట్టుకొని కయ్యానికి కాలు దువ్వుతూ అందరిని ఆకట్టుకున్నాయి. అయితే ఈసారి వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. నర్సాపురంలో వైసీపీ పుంజు.. టీడీపీ కోడి పుంజులు తలపడ్డాయి. వీటి మధ్య పోటీని చూసేందుకు జనం ఎగబడ్డారు.
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోడి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడి బరిలోకి దిగాయి. రెండు ప్రత్యర్థి పార్టీల నేతలే అయినప్పటికీ సరదాగా సంక్రాంతి పందాలు కాశారు. ఈ పోటీని సంతోషంగా నిర్వహించుకున్నారు. ఈ విషయాన్ని శ్రీనివాసరావు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులైనా పండుగ సమయంలో అవన్నీ పక్కన పెట్టి సరదాగా ఉండటం అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
https://www.facebook.com/GantaSrinivasaRaoOfficial/photos/pcb.1433613510133787/1433612020133936/?type=3&__tn__=HH-R&eid=ARDUcN2xc4iP-pdLyIaBSevB1wmsWyU2IRXOMaJyAmyM2Ds_tgB4yR72-pMM1Z1Dvaam5VGsGwMpxXgh&__xts__%5B0%5D=68.ARDiKkYk4MhFT6hAn4x_ScZn0Lx6Ka9IHOYqX2tXRqH3XQQp45_q-15bXQF5AODxXl8qeonSrd6YQnislLFjtzoT2pV-ykL6CBc-RQAWJgnEPKx8vynx5pEB67vLAoa659x20nkJKVn_El5-zHAGxCUsRAS_DIaJrD_y72yCjAuysG3nSq6L-vf_gc4LbulEUBuridFo4u0q8ws8dOTJkUqO1m46Hee8prpi3mF3eS78R9QkmBkA46-Y9Le9BTINRCg-gFoQ2_N_ADvZFQ7mCpd47ZG3_d2_ynlFiecVZF17wWfiK4pTp8uNRRzbdJQsFLTNMqEjrO_BuVYzL_DOs4HabQ
https://www.facebook.com/GantaSrinivasaRaoOfficial/photos/pcb.1433613510133787/1433612256800579/?type=3&__tn__=HH-R&eid=ARD7qbMDT6n7vrHHfXXMy_EGnmFfcATx1x2jeISxh6M7c6nEfN4HqwaM1m2l22-g-qrYha360Bbv6LPV&__xts__%5B0%5D=68.ARDiKkYk4MhFT6hAn4x_ScZn0Lx6Ka9IHOYqX2tXRqH3XQQp45_q-15bXQF5AODxXl8qeonSrd6YQnislLFjtzoT2pV-ykL6CBc-RQAWJgnEPKx8vynx5pEB67vLAoa659x20nkJKVn_El5-zHAGxCUsRAS_DIaJrD_y72yCjAuysG3nSq6L-vf_gc4LbulEUBuridFo4u0q8ws8dOTJkUqO1m46Hee8prpi3mF3eS78R9QkmBkA46-Y9Le9BTINRCg-gFoQ2_N_ADvZFQ7mCpd47ZG3_d2_ynlFiecVZF17wWfiK4pTp8uNRRzbdJQsFLTNMqEjrO_BuVYzL_DOs4HabQ