అమరావతి: కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్, తదితర విషయాలను ఉదహరిస్తూ చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
చిదంబరం 20 సార్లు ముందస్తు బెయిల్‌తో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతేననీ, వ్యవస్థలను మ్యానేజి చేయడం ఇంతకుముందు లాగా సులువు కాదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
గతంలో సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కన్నాను కదిలించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించుకునేందుకు సుజనా చౌదరి, సిఎం రమేష్‌ల ద్వారా చంద్రబాబు లాబీయింగ్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో పరిణామాలను వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు తమ బాస్ చంద్రబాబుకు బ్రీఫ్ చేస్తుంటారని విజయసాయిరెడ్డి అన్నారు.
తన ఇంటిని ముంచటానికి కృత్రిమ వరద సృష్టించారని చంద్రబాబు అనడంపై విజయసాయిరెడ్డి ‘సైరా ఫంచ్’ విసిరారు. ఆయనకు మానసిక వైద్యం అవసరం అంటూ విశాఖ, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రుల అడ్రస్సులను తెలియజేస్తూ ఫోటో ట్యాగ్ చేశారు.
కృష్ణానది కరకట్టపై వరద ముంపులో ఉన్న చంద్రబాబు నివాసంతో పాటు ఆయన ఫోటో, విశాఖ, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రుల ఫోటోలను ట్యాగ్ చేస్తూ ‘వీరికి వైద్యం అత్యవసరం, మానవతా దృక్పథంతో పిచ్చాసుపత్రుల అడ్రస్ ఇస్తున్నాం’ అంటూ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా పేర్కొన్నారు.
కొంచెం ఆలస్యమైనా కుట్రలు, దోపిడీలు చేసిన వారి పాపం పండుతుంది. చిదంబరం 20సార్లు ముందస్తు బెయిలుతో అరెస్టు తప్పించుకున్నా చివరకు కటకటాల పాలుకాక తప్పలేదు. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. వ్యవస్థలను మ్యానేజి చేయడం మునుపటంత సులువు కాదిప్పుడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 23, 2019
గతంలో సోము వీర్రాజును రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు కన్నాను కదిలించి తన విధేయుడిని అధ్యక్షుడిగా నియమించేందుకు సుజనా, సిఎం రమేశ్ ల ద్వారా లాబీయింగ్ చేస్తున్నాడు. ఢిల్లీలో పరిణామాల్ని వీళ్లిద్దరు ఎప్పటికప్పుడు తమ బాస్ కు బ్రీఫ్ చేస్తుంటారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 23, 2019
#SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/yh9n6TOhP8
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 23, 2019