యుపి హోంగార్డులపై సామూహిక వేటు!

  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన పలికింది. యోగి ఆదిత్యనాధ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది. తగినంత బడ్జెట్ లేని కారణంగా దీపావళి పండుగ ముందే ఇంత భారీ సంఖ్యలో హోంగార్డులను తొలగించడం సంచలనమైంది.

పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు కూడా వేతనాలు చెల్లించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. గతంలో రోజుకు 500 రూపాయలుగా ప్రభుత్వం హోంగార్డులకు వేతనం చెల్లించింది. ఈ తీర్పుతో ఆ వేతనాన్ని 672 రూపాయలకు పెంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పరిమితంగా ఉన్న కారణంగా 25వేల మంది హోంగార్డులు విధుల నుండి రిలీవ్ అవ్వాలని ప్రయాగ్‌రాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బిపి జోగ్దాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.