వైఎస్ జగన్ పాదయాత్ర @ 3500 కి.మీలు

టెక్కలి, డిసెంబర్ 22 : వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహనరెడ్డి ఏడాది క్రితం చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద 328వ రోజు డిసెంబర్ 22న శనివారం 3500 కిలో మీటరు మైలురాయి దాటింది. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ నేతల సమక్షంలో పార్టీ పతాకం ఆవిష్కరించి ఆయన ఓ మొక్క నాటారు.  వైఎస్ జగన్ పాదయాత్ర 2019 జనవరి మొదటి వారంలో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. జగన్ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాన్ని నింపిందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ బహిరంగ సభల్లో తెదేపా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, అధికారంలోకి రాగానే చేపట్టబోయే నవరత్న సంక్షేమ పథకాలను జగన్ వివరిస్తున్నారు.  పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందటం పట్ల  పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

3500 కి.మీలు పూర్తయిన సందర్భంగా వైెెఎస్ జగన్ మొక్క నాటిన వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SHARE