NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి… మ‌ర‌ణం లేని మ‌హానేత‌

ys rajasekhar reddy wins hearts of telugu people

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి….దివంగ‌త ముఖ్య‌మంత్రి, ఆయ‌న్ను స‌మాజం ఎంత గుర్తు పెట్టుకుంటుందో అందులో కొన్ని వ‌ర్గాలు అంత‌కంటే ఎక్కువ‌గా గుర్తుంచుకుంటాయి. ys rajasekhar reddy wins hearts of telugu people

అలాంటి అనేక వ‌ర్గాల్లో రైతుల‌ది అగ్ర‌స్థానం. 2004లో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి సకాలంలో వర్షాలు పడక, ప్రాజెక్టుల నుండి నీరు విడుదల గాక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు గణనీయంగా తగ్గిపోయి, ఆ పండిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు కూడా అమ్ముకోలేక రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి. అలాంటి స్థితి నుంచి రైతుల‌ను ఒడ్డున పడేసిన ఘ‌న‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిది

పుచ్చ‌ల‌ప‌ల్లి సుందర‌య్య మాట‌లే…

1978–83 మధ్య శాసనసభలో పుచ్చ‌ల‌ప‌ల్లి సుందరయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతటా నదీ జలాలను కనీసం ఒక పంటకయినా అందించాలని చేసిన ప్రసంగాలు తన చెవిలో యింకా మార్మోగుతున్నాయని ఆ దిశగా ఆలోచనలు చేయాలని వైఎస్సార్ ఓ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అదే స్ఫూర్తితో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటుగా జలయజ్ఞానికి ఆయన శ్రీకారం చుట్టడం గమనార్హం.

ఇది వైఎస్ఆర్ చిత్త‌శుద్ధి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 దివాళా తీసిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బాద్య‌త‌లు చేపట్టిన త‌ర్వాత‌ మొదటి కార్యక్రమం–ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుం బాలు అనాథలు కాకూడదనే ఉద్దేశంతో జీవో 421 విడుదల చేసి 2 లక్షల రూపాయల పరిహారం అందిం చడం. అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఆత్మ హత్యలు చేసుకున్న రైతులకు కూడా అందేలా చర్య తీసు కోవడం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతుకు వెన్నెముక. వైద్యనాథన్‌ కమిటీ సిఫా రసులు అమలు చేసి రూ.1,800 కోట్లు సహకార సంఘా లకు సహాయం అందించి, పూర్తిగా నష్టాలలో ఉన్న సంఘాలను పక్క సహకార సంఘంలో కలిపి సహకార వ్యవస్థను కాపాడారు.

ఉచిత విద్యుత్ ఓ సంచ‌ల‌నం

సాగునీటి వనరులకు ప్రధాన ఆధారం ఒకటి ప్రాజెక్టులు, రెండవది భూగర్భ జలాలు. ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎకరానికి నీరివ్వాలంటే ప్రభుత్వానికి లక్షలలో ఖర్చు అవుతుంది. అదే భూగర్భ జలాలకైతే రైతు సొంత ఖర్చుతో బోరు బావి ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ ఇవ్వాలని సంకల్పిస్తే కొంతమంది ఎగతాళి చేశారు. కానీ ఆయన సంకల్ప బలం నేడు అనేక రాష్ట్రాలకు ఆదర్శమైంది. నేడు సుమారు 18.70 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల ఉచిత విద్యుత్‌కు ఇదే పునాది.

పెద్ద దిక్కును కోల్పోయిన రైతులు

పావలా వడ్డీకే పంట రుణాలు, 90 శాతం రాయితీతో పెద్ద ఎత్తున బిందుసేద్య పరికరాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ఒక్క రూపాయి పన్ను పెంచలేదు, ఒక్క రూపాయి కొత్త పన్ను వెయ్య లేదు. రైతాంగ సమస్యలపై ఎప్పుడు ఏది చెప్పినా, సహృదయంతో స్వీకరించేవారు వైఎస్ఆర్‌. రైతుల కోసం పాటు పడేవారెవరైనా సరే తన సొంత మనుషులుగా చూసేవారు. మనస్సు విప్పి మాట్లాడేవారు, సమస్యలు పరిష్కరించేవారు. రాష్ట్రంలోని రైతులకు కొండంత అండగా ఉండేవారు. ఆయనతో రాజకీయంగా విభేదించేవారైనా సరే రైతాంగం పట్ల ఆయనకున్న పక్షపాతాన్ని, వారి ఉద్ధరణ పట్ల వారికి గల నిబద్ధతను కాదనలేరు. వ్యవసాయ రంగాన్ని బాగు చేసి రైతుల బ్రతుకుల్లో వెలుగు నింపుదామన్న ఆయన తపనను వైరిపక్షం వారు కూడా తప్పుపట్టలేరు. రాష్ట్రంలో రైతాంగానికి, వారి కోసం శ్రమించే మాబోటి వారందరికీ వైఎస్సార్‌ అకాల మరణంతో, పెద్దదిక్కును కోల్పోయినట్లు అయ్యింది.

author avatar
sridhar

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk