23 years Boy: ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన.. ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఇప్పటివరకు ప్రేమకు కులం, మతం అడ్డుకాదని ప్రేమించుకున్న వారు ఎందరో.. అయితే ఇప్పుడు వయస్సు భేదం కాదని నిరూపిస్తోంది ఈ జంట. 23 ఏళ్ల క్వారిన్ అనే యువకుడు 60 ఏళ్ల చెర్రీ అనే బామ్మతో ప్రేమలో పడ్డాడు.. వీరిద్దరి మధ్య 37 సంవత్సరాలు తేడా ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి కుర్రకారు కూడా కుళ్ళుకోవాల్సిందే.. ప్రస్తుతం వీరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
అమెరికాకు చెందిన 23 ఏళ్ల క్వారిన్ అనే యువకుడు 60 ఏళ్ల చెర్రీ అనే బామ్మతో ప్రేమలో పడ్డాడు. వయసు తమకు పెద్ద సమస్య కాదంటున్నారు ఈ జంట. క్వారిన్ ఆమెకు ముద్దులు పెడుతూ, డాన్స్ చేస్తున్నా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ జంట. ఇది చూసిన నెటిజెన్లు రక రకాలుగా స్పందించారు. దీంతో వీరి ప్రేమ వ్యవహారం వైరల్ గా మారింది. తాజాగా తమ ప్రేమ వ్యవహారంపై ఈ జంట స్పందించింది.
Read More: Guava Fruit: ప్రతిరోజూ ఒక్క జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే జామను అస్సలు వదలరు..
మా ప్రేమ బంధం నిజాయితీతో కూడుకున్నది. ఆకారం, వయసు ముఖ్యం కాదు. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అన్నింటికిమించి మనసు చూసి మేము ఒకరినొకరం ఇష్టపడ్డాము అని చెర్రీ తెలిపింది. క్వారిన్ కంటే నా కొడుకులు మూడు సంవత్సరాలు పెద్దవారు వారు కూడా మా బంధాన్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. మేము తప్పు చేయడం లేదు అని వారు భావించారు. మేము ఇద్దరం కలిసి రకరకాల కార్యక్రమాలకు వెళ్దాం. మమ్మల్ని అర్థం చేసుకోకుండా తప్పు పట్టే వారిని గురించి మేము అసలు పట్టించుకోము. మా దృష్టిలో వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని చెర్రీ తెలిపింది.