NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జుట్టు కత్తిరిస్తే చచ్చిపోతాడన్న భయంతో 80 ఏళ్ల నుంచి అలాగే ఉంచుకున్నాడు.. ఇప్పుడు ఆ జుట్టు ఎలా ఉందో చూడండి..!

92 year old Vietnam man has 16 feet long hair

జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడవాళ్లకు జుట్టు పెరిగితే అందం. మగవాళ్లకు జుట్టు ఊడకుండా ఉంటే అందం. అసలు జుట్టు ఉంటేనే ఎవరికైనా అందం. ఇప్పుడు ఈ జుట్టు అందాల గోల ఎందుకంటే.. ఓ మనిషి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన జుట్టే స్పెషల్. అదో పెద్ద కథ.. కానీ.. చిన్నగానే చెప్పుకుందాం పదండి…

92 year old Vietnam man has 16 feet long hair
92 year old Vietnam man has 16 feet long hair

అది వియత్నాంలోని డాంగ్ హోవా అనే గ్రామం. అక్కడే గుయెన్ వన్ చెన్ అనే వ్యక్తి నివసిస్తుంటాడు. పండు ముసలి. వయసు 92 ఏళ్లు. కానీ.. ఇప్పటికీ ఆ ముసలోడు కాస్త గట్టిగానే ఉన్నాడు. తన పని తాను చేసుకోగలడు. నడుస్తాడు కూడా.

ఇక ఆయన పేరు కన్నా.. పొడవైన జుట్టు ఉన్న ముసలాయన అంటేనే చాలామంది గుర్తు పడతారట. ఎందుకంటే ఆయన జుట్టు 16 ఫీట్ల పొడవవు ఉంటుంది కాబట్టి. ఆయన నడవడమే కష్టంగా ఉన్న ఈ వయసులో 16 ఫీట్ల పొడవు ఉన్న జుట్టును కూడా మోస్తూ ఉండాలి.

92 year old Vietnam man has 16 feet long hair
92 year old Vietnam man has 16 feet long hair

గుయెన్.. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన జుట్టు కట్ చేసుకుంటే చచ్చిపోతాను అని భయపడ్డాడట. అంతే.. అప్పటి నుంచి జుట్టు కట్ చేసుకుంటే ఒట్టు. అలాగే ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు వయసు 92. అంటే దాదాపు 80 ఏళ్ల నుంచి ఆ జుట్టును కత్తిరంచలేదు. అలాగే పెరుగుతూ పోయింది. చివరకు 16 అడుగులకు చేరింది.

మీకు ఇంకో విషయం తెలుసా? గుయెన్ ఆ జుట్టును 80 ఏళ్లలో ఒక్కసారి కూడా దువ్వుకోలేదట. ఒక్కసారి కూడా తల స్నానం చేయలేదట. జుట్టును కత్తిరించుకోవడమే కాదు.. దువ్వుకున్నా.. తల స్నానం చేసినా ఎక్కడ చచ్చిపోతానో అని భయపడి ఇలాంటి సాహసానికి ఒడిగట్టాడు గుయెన్.

92 year old Vietnam man has 16 feet long hair
92 year old Vietnam man has 16 feet long hair

ఇక.. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మాత్రం ఆ జుట్టును తల మీద కొప్పిలా చేసుకొని.. దాని మీద స్కార్ఫ్ పెట్టుకొని వెళ్తాడట.

అయితే తాను ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ.. అతడి జుట్టు మాత్రం ఆయన్ను తెగ ఫేమస్ చేసేసింది. ఇక.. తన కొడుకు మాత్రం అప్పుడప్పుడు తండ్రి జుట్టును చిక్కుల్లేకుండా చేసి కొప్పులా తయారు చేయడానికి అప్పుడప్పుడు సాయం చేస్తుంటాడట.

92 year old Vietnam man has 16 feet long hair
92 year old Vietnam man has 16 feet long hair

వియత్నాంలో మూఢ నమ్మకాలు ఎక్కువ. జుట్టుకు, మనిషి చావుకు ఏదో సంబంధం ఉంటుందనేది వియత్నాం వాసుల నమ్మకం. దాన్నే దువా అని కూడా అంటారు. ఈ మూఢ నమ్మకాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా కూడా వీళ్లను మార్చడం ఎవ్వరి తరం కాదు.

author avatar
Varun G

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?