ఇగో కి చోటులేనిదే ప్రేమ. ఇద్దరి భావాలు , ఆలోచనలు ఒకటై … జీవితాంతం కలిసి నడుస్తాము అన్న నమ్మకం ఏర్పడినప్పుడు రెండు మనుసుల మధ్య ఏర్పడే బంధమే ప్రేమ.
ప్రేమ అనేది ఓక మధుర జ్ఞాపకం. ఎంతో మంది తమ ప్రేమను త్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయిన వారు ఉన్నారు. ప్రేమకి కులం, మతం, జాతి, దేశం ఇవేవి అడ్డు కాదు అంటారు. ఇదే నిజమని నిరూపించారు ఒక ప్రేమ జంట. ఆ వివరాలు ఏమిటో చూద్దామా.
మధ్యప్రదేశ్ కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ఒక రోజు వారి ఉద్యోగి. నరేంద్ర కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లో ఉన్న పొలాల్లో పని చేస్తారు. తను ఉంటున్న ఊరిలో ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో, ఉద్యోగం ఏమైనా దొరుకుతుందేమో అని గోవా వెళ్ళాడు. అక్కడ ఒక బార్ లో బేరర్ ఉద్యోగంలో చేరాడు.
ఒకసారి ఆ బార్ లోకి అనస్టాతా అనే అమ్మాయి వచ్చింది. నాగేంద్ర ని పిలిచి బీర్ ఆర్డర్ ఇచ్చింది. ఆమె అడిగిన బీర్ ను తెచ్చిచ్చాడు నాగేంద్ర. నాగేంద్ర ని చూసిన అనస్టాతా నాగేంద్ర తో ప్రేమలో పడింది. అనస్టాతా రష్యా కు చెందిన అమ్మాయి. రష్యన్ పార్లమెంట్ హౌస్ లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంది. అనస్టాతా ని చూడడానికి నరేంద్ర రష్యా వెళ్ళేవాడు.
తర్వాత ఇద్దరూ 2016 లో గోవా లో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. నరేంద్ర అనస్టాతా ని వాళ్ల ఊరికి తీసుకొచ్చాడు. నరేంద్ర ఊరి వాళ్ళందరూ అనస్టాతా ని చూసి ఆశ్చర్యపోయారు.పెద్ద చదువులు చదివిన అమ్మాయి నరేంద్ర ని ఎలా పెళ్లి చేసుకుంది అని షాకయ్యారు.
ఇప్పుడు వాళ్ల పెళ్లి అయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. నరేంద్ర పూర్తిగా రష్యా క్యాపిటల్ అయిన మాస్కో లో స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ ప్రేమని దక్కించుకోవడానికి చరిత్ర సృష్టించిన వారు ఉన్నారు. ప్రేమంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక. వీరి ప్రేమ చూస్తుంటే ఆ మాటలన్నీ నిజమే అని అనిపిస్తుంది.