NewsOrbit
ట్రెండింగ్

చపాతీ తిని చచ్చిపోయాడు !

చపాతీ తిని చచ్చిపోయాడు !
Share

ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా  జిల్లా బేతుల్ నగర్ జడ్జి  మహేంద్ర త్రిపాఠి కి  భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు.

చపాతీ తిని చచ్చిపోయాడు !

అయితే సక్రమ దారిలో నడవాల్సిన ఆ జడ్జి..  సామాజిక కార్యకర్తగా పని చేసే సంధ్యారాణి తో పరిచయం పెంచుకుని ఆ తర్వాత వివాహేతర సంబంధానికి తెరలేపాడు. కొన్ని రోజులపాటు వీరిద్దరి మధ్య రాసలీలలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ప్రియురాలిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు.

ఇక ఒక్కసారిగా తనను దూరం పెట్టడంతో సంధ్యారాణి కి ఏమీ అర్థం కాలేదు. మరో అందగత్తె దొరికిందా అందుకే నన్ను వదిలేస్తున్నావా అంటూ వేధించడం మొదలు పెట్టింది ప్రియురాలు. ఇక సంధ్యారాణి ఆ జడ్జి కి ఎన్ని సార్లు దగ్గరవ్వాలని ప్రయత్నించినప్పటికీ, త్రిపాఠి  మాత్రం దూరం పెడుతునే  వచ్చాడు. అల జరగడం తో సంధ్యారాణి జడ్జిపై పగ పెంచుకుంది. ఎలాగైనా జడ్జి త్రిపాఠి  కుటుంబాన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలోనే ఓ రోజు త్రిపాఠి ని  కలిసి లోపల కోపం దాచుకుని పైకి మాత్రం ప్రేమను నటించింది. ఇక ఇది నమ్మిన  త్రిపాటి తన కుటుంబ విషయాలను కొన్నింటిని ఆమెతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబ సమస్యలు తొలగి పోవడానికి ప్రత్యేక పూజలు చేసి గోధుమపిండి తెచ్చి ఇస్తానని చెప్పి అందులో విషం కలిపి తెచ్చింది.  కుటుంబ సభ్యులందరూ తినాలి అంటూ తెలిపింది.

కుటుంబ సభ్యులు చపాతీలు చేసుకుని తిన్నారు. కానీ ఆ జడ్జ్ భార్య మాత్రం అన్నమే తిన్నది. ఇక చపాతీలు తిన్న జడ్జి సహా ఇద్దరు కొడుకులు అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రికి తరలిస్తుండగా జడ్జి,  అతనిపెద్ద కొడుకు ఇద్దరు మృతి చెందగా చిన్న కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దీనిపై విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.


Share

Related posts

అఖిల్ కి షాక్ ఇచ్చిన మోనాల్…. నా అసలు లవర్ అతనే అని ఫ్ల్యాష్ బ్యాక్ బయటపెట్టిన గుజరాతీ బ్యూటీ

arun kanna

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ కాజల్ కి ఊహించని షాక్ ఇచ్చిన కంటెస్టెంట్..??

sekhar

China: చైనా నుంచి ఇంకో వైర‌స్ …ఇదేం ఖ‌ర్మ‌రా బాబు!

sridhar