aadhaar services: ఆధార్ కార్డుదారులకు సంబంధించి కొన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి. యూఐడీఏఐ తాజాగా వీటిని వెల్లడించింది. ఆధార్ కార్డులో అడ్రస్ వాలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ మార్చుకోవడం ఇకపై సాధ్యం కాదు. అలాగే ఆధార్ కార్డు రీ ప్రింట్ సేవలు కూడా అందుబాటులో ఉండవు. అడ్రస్ వాలిడేషన్ లెటర్ ఆప్షన్ తొలగించడం వల్ల అద్దెకు ఉంటున్న వారిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు లేని వారు కూడా ఇక పై అడ్రస్ మార్పుకోవడం కష్టతరం కావొచ్చు. అదే విధంగా ఆధార్ కార్డు రీ ప్రింట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉండవు. అధార్ రీ ప్రింట్ పొందాలంటే వారు పీవీసీ కార్డు రూపంలో మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఇది డెబిట్ కార్డు రూపంలో ఉంటుంది.
ఇటీవల ఓ వినియోగదారుడు ట్విట్టర్ ద్వారా యూఐడీఎఇని సంప్రదించగా ఈ వివరాలను వెల్లడించింది. ఇక అధార్ కార్డులో తప్పులుంటే వాటిని సులభంగానే మార్చుకోవచ్చు. అడ్రస్, పేరు, పుట్టిన తేదీ వంటి వాటిల్లో తప్పులు ఉంటే ఇంట్లో నుంచే ఆప్ డేట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ అప్ డైట్ కోసం లాంటి సర్వీసులకు మాత్రం ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది.