Aadhar: ప్రతి ఒక్కరూ తమ ఆధార్ తో పాన్ కార్డులను లింకు చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటినుంచో పేర్కొంటుంది. అయితే చాలా కాలంగా ఆధార్ మరియు పాన్ లింకింగ్ తేదీని పెంచుతున్న ప్రభుత్వం ఇటీవల చివరి తేదీని ప్రకటించింది. 1961 లో సెక్షన్ 139A A ప్రకారం మార్చ్ 31 నాటికి ఆధార్ పాన్ లింకు చేయకపోతే పాన్ కార్డు ఏప్రిల్ 1,2023 నుండి పనిచేయదని ప్రభుత్వం తెలిపింది.

అయితే ఇప్పటికే చాలామంది లింక్చేసుకున్నారు. ఇక కొంతమందికి తమ ఆధార్ మరియు పాన్ లింక్ చేయబడిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం సులభంగా మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు..Sms ద్వారా ఆధార్ పాన్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి UIDPAN అని టైప్ చేసి 567678 లేదా 56161 కి సెండ్ చేయాలి. ఆ తర్వాత డేటా బేస్ లో చెకింగ్ పూర్తయిన తర్వాత ఆధార్ మరియు పాన్ లింకింగ్ గురించిన స్టేటస్ మెసేజ్ ద్వారా వస్తుంది. వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనుకునే వారు పాన్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చ కోడును ఎంటర్ చేసి స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు..