abijeet: బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగిసి చాలా రోజులు అయిపోయింది. టైటిల్ విన్నర్ గా Abijeet గెలుపొందిన గాని పెద్దగా బయట హడావిడి ఏమిలేదు. టైటిల్ గెలిచాక హౌస్ నుండి బయటకు వచ్చాక మొదటి రోజు కుటుంబ సభ్యులతో గడిపిన అభిజిత్ తర్వాత తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్బాస్ హౌస్ అనుభవాల గురించి తన కెరీర్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే Abijeet మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకు బయటకు రాలేదు. అంతేకాకుండా సమంతతో ఓ షోను కూడా ప్లాన్ చేసినట్లు అప్పట్లో వార్తలు రాగా వాటికి సంబంధించి అభిజిత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఇండస్ట్రీ నుండి వినబడుతున్న సమాచారం ప్రకారం ఓ టాప్ డైరెక్టర్ తో అభి సినిమా ఓకే అయినట్లు లేటెస్ట్ వార్త హల్ చల్ చేస్తోంది.
స్క్రిప్ట్ అంటే ఓకే అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినబడుతోంది. ఇదే తరుణంలో హౌస్ నుండి బయటకు వచ్చిన సోహెల్ ఆల్రెడీ ఇప్పటికే ఒక సినిమా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ కి డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అవకాశం ఇవ్వడం జరిగింది. మరోపక్క అరియనా కూడా సినిమాకి రెడీ అవుతుంది. ఇలాంటి తరుణంలో టాప్ డైరెక్టర్ తో అభి సినిమా అన్న వార్త వినబడుతున్న తరుణంలో కచ్చితంగా త్వరలో అభి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినబడే అవకాశం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.