Acharya: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ పాత్ర లో కనిపించనున్నారు.. తాజగా ఈ సినిమా నుంచి ఉగాది కానుకగా స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నిర్మిస్తున్నారు.. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఆచార్య.. ఈ సినిమా కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ను మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది..