Maa Associatation: “మా” అసోసియేషన్ పై నటుడు సాయి కుమార్ సంచలన కామెంట్స్..!!

Share

Maa Associatation: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో.. మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ పోటీ పడటం జరిగింది. ఈ క్రమంలో మంచు విష్ణు(Vishnu) గెలవటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడిన మా అసోసియేషన్ పై సీనియర్ నటుడు సాయికుమార్(Sai Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సాయికుమార్… వాస్తవానికి యునానిమస్ గా ఎన్నికలను చేయాలని ఇండస్ట్రీ పెద్దల ను కోరడం జరిగింది.

Your Film Budget Equals Pawan's Morning Show Collection', Prakash Raj To  Vishnu - Movie News

స్వయంగా ఈ విషయంలో నేనే చొరవ తీసుకుని అందరితో కూడా మాట్లాడాను కానీ డెమోక్రసీ విధానంలో ఎన్నికలు జరిగాయి మంచు విష్ణు గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్నికలు ఫలితాలు వచ్చే రెండు నెలలు కావస్తున్నా గాని.. మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చేసింది ఏమైనా ఉందా అని యాంకర్ సాయికుమార్ ని ప్రశ్నించారు. ఈ క్రమంలో సాయి కుమార్ దానికి సమాధానం ఇస్తూ.. ఇటీవలే ఇండస్ట్రీలో ఉన్న “మా”(MAA) సభ్యులందరినీ మంచు విష్ణు టీం కలవడం జరిగింది. అంతేకాకుండా ఆ సమయంలో నన్ను కూడా కలిశారు.

MAA gets its date finally, elections to be held on October 10 | Telugu  Movie News - Times of India

ఎన్నికల టైంలో హామీలు ఇవ్వడం కాదు, నెరవేర్చాలి అని విష్ణు(Vishnu) కి చెప్పాను. దీంతో ఇప్పటికే పని స్టార్ట్ చేశారు. బిల్డింగ్ విషయంలో ఇంకా చాలా విషయాలలో మంచు విష్ణు టీం అన్ని రకాలుగా అందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉంది. పైగా ప్రకాశ్ రాజ్(Prakash Raj) ప్యానల్ కి చెందిన గెలిచిన సభ్యులు రాజీనామా చేయటంతో ఇంకా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉండటంతో.. త్వరగా ఇండస్ట్రీకి మంచి పనులు చేయాలని, అసోసియేషన్ సభ్యులకు చేయాల్సింది చాలా ఉందని.. అసోసియేషన్ పెద్దలకు తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీకి మంచి చేసే అవకాశం విష్ణుకి లభించింది కాబట్టి ఎంత ఎక్కువ మంచి చేస్తే ఇండస్ట్రీ ఎంత బాగుంటుందని తెలియజేసినట్టు సాయికుమార్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

Bhumika: క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ భూమిక..!!

sekhar

Chamoline Tea: చామంతి టీ తో మీ అందం రెట్టింపు..!!

bharani jella

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో నేను మాట్లాడా విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar