Surya: తమిళ్ నటుడు సూర్య కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గజిని సినిమా నాటి నుండి తెలుగులో అనేక సినిమాలతో సూర్య సత్తా చాటుతూ ఉన్నాడు. తమిళంలో చాలా తక్కువ మందికి తెలుగులో మార్కెట్ వుంది. వారిలో సూర్యా కి మంచి మార్కెట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండటం విశేషం. చాలా స్పష్టంగా కూడా సూర్య తెలుగు మాట్లాడుతారు.
ఈనేపథ్యంలో ఎప్పటినుండో సూర్య స్ట్రైట్ తెలుగు ఫిలిం ఒకటి చేయాలని ప్లాన్లు వేస్తున్నారు. ఎన్నాళ్లకు సూర్యకళ నెరవేరడానికి టైం దగ్గర పడినట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళ్తే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో టాప్ నిర్మాత దిల్ రాజు సారథ్యంలో సినిమా చేయడానికి సూర్య ఒప్పుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని పాన్ ఇండియా తరహాలో… తెరకెక్కించాలని సూర్య మరియు డైరెక్టర్ నిర్మాతలు అనుకుంటున్నారట.
Read More: Dil raju : దిల్ రాజు రాం చరణ్ ప్రాజెక్ట్‌కి బ్రేక్ పడినట్టేనా..?
ఆ రీతిగానే స్క్రిప్ట్ రెడీ అయినట్లు.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిర్మాత దిల్ రాజు చాలా వరకు తన నిర్మాణ ప్రొడక్షన్ వేల్యూస్ ఉన్న కొద్దీ పెంచుకుంటూ పోతూ ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. రామ్ చరణ్ ..శంకర్ కాంబినేషన్ అదే రీతిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలు నిర్మించే దిశగా దిల్ రాజు .. తాజాగా సినిమాలు ఒప్పుకోవడం బట్టి తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే సౌత్ ఇండియా లో టాప్ డైరెక్టర్లతో టాప్ హీరోలతో సినిమాలు ఒప్పుకుంటూ సరికొత్త కాంబినేషన్ లు దిల్ రాజు తెరపైకి తీసుకువస్తున్నారు.