HBD Adith Arun: 24 కిస్సెస్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న యువ కథానాయకుడు అదిత్ అరుణ్.. ఈ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. నేడు అదిత్ అరుణ్ పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న డియర్ మేఘా, కథ కంచికి మనం ఇంటికి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాల నుంచి పోస్టర్స్ ను విడుదల చేశారు.. డియర్ మేఘ చిత్రం నుంచి అదిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..!!

అదిత్ అరుణ్ నటిస్తున్న మరో సినిమా కథ కంచికి మనం ఇంటికి.. డి.సురేష్ నిర్మాతగా స్వాతి సినిమాస్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. ఈ సినిమాలో అదిత్ అరుణ్ జంటగా పూజిత పొన్నాడ నటిస్తోంది.. అదిత్ అరుణ్ బర్తడే ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి అది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్..

డియర్ మేఘ చిత్రంలో అదిత్ అరుణ్ సరసన మేఘా ఆకాష్ నటిస్తోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో, వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది..
హీరో అదిత్ అరుణ్, శివాని జంటగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్, పాటలు ఈ సినిమా మంచి హైప్ క్రియేట్ చేశాయి.. తాజాగా ఈ సినిమా నుంచి కూడా అదిత్ అరుణ్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా అది కూడా ఆకట్టుకుంది.