28.2 C
Hyderabad
February 4, 2023
NewsOrbit
ట్రెండింగ్

ఆకాశంలో అద్భుతం: 50 వేల సంవత్సరాల తరువాత మళ్ళీ కనిపించనున్న తోకచుక్క! ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

Share

ఆకాశంలో అద్భుతం: ప్రస్తుత ప్రపంచంలో రకరకాల వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ దాటికి రెండున్నర సంవత్సరాలు పాటు ప్రపంచం స్తంభించడం తెలిసిందే. ఈ మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలకు చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాలలో వైరస్ ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇంక భూమి మీద రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విపరీతమైన భూకంపాలు రావడంతో పాటు కొన్నిచోట్ల అకారణంగా భవనాలు కోల్పోతున్నాయి. మరికొన్ని చోట్ల మేఘాలు… భూమిపై వాలిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఆకాశంలో కూడా వింతైనా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఎక్కువుగా కొన్ని తోకచుక్కలు భూమికి దగ్గరగా వస్తూ ఉన్నాయి. సాధారణంగా మనం నివసించే భూమిపై ఆకాశంలో గురుగ్రహం, మార్స్, శనిగ్రహం కనిపిస్తూనే ఉంటాయి. ఇక తోకచుక్కల విషయానికొస్తే అయిదురేళ్ల ఒక్కసారి ఈమధ్య భూమికి దగ్గరగా తోకచుక్కలు వస్తూ ఉన్నాయి. కానీ లేటెస్ట్ గా 50వేల ఏళ్ల సంవత్సరాల కిందట భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిన ఈ తోకచుక్క మరోసారి ఇప్పుడు రాబోతుందట. 50వేల ఏళ్ల సంవత్సరాల క్రితం అంటే భూమిపై మానవ మనుగడలేదు.

after 50 thousand years Next week a big strange comet near to earth

అప్పుడు అన్ని నదులు, మహాసముద్రాలు కొన్ని జంతువులు మాత్రమే నివసించేవి. అయితే ఇప్పుడు మాత్రం ఈ తోకచుక్కను చూసి అదృష్టం అందరూ సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. జనవరి 12వ తారీకు సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్క ఫిబ్రవరి మొదటి తారీకు నాడు భూమికి అత్యంత దగ్గరగా రాబోతుందట. అయితే ఈ అరుదైన తోకచుక్కని ఇళ్లపై నుండి చూస్తే పెద్దగా కనబడదని అంటున్నారు. ఎందుకంటే కాంతివంతమైన వీధిలైట్ల మధ్య అంత స్పష్టంగా కనబడదట. దీంతో అంధకారంగా చీకటి ప్రాంతంగా ఉండే నిర్మానుషమైన ప్రదేశంలో నిలబడి ఆకాశం వైపు చూస్తే ఖచ్చితంగా ఈ తోకచుక్క బాగా కాంతివంతంగా కనిపిస్తుందట. మామూలు కళ్లతో కూడా చూసే వీలు ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలియజేయడం జరిగింది.

after 50 thousand years Next week a big strange comet near to earth

2020 మార్చి నెలలో నియోవైజ్ అనే తోకచుక్క భూమికి దగ్గరగా రావడం జరిగింది. కానీ ఫిబ్రవరి మొదటి తారీకు కనబడబోయే ఈ తోకచుక్క…నియోవైజ్ కంటే ఎక్కువ అధిక రెట్లు పెద్దదని,,, సుమారుగా కిలోమీటర్ వ్యాసార్థంతో ఉందట. అందువల్లే ఇది చాలా స్పష్టంగా.. ఆరోజు కనిపించనుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఇది 50వేల ఏళ్ల సంవత్సరాల తర్వాత భూమికి దగ్గరగా రావడానికి ప్రధాన కారణం పారాబొలిక్ కక్ష్యామార్గంలో పయనించటమే అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అందువల్ల.. ఇది ఒక రౌండ్ పూర్తి చెయ్యడానికి 50వేల ఏళ్లు పడుతుందట.

after 50 thousand years Next week a big strange comet near to earth

కాబట్టి దీన్ని మిస్సవకుండా చూడమంటున్నారు. మరోపక్క అతిపెద్ద తోకచుక్క కావటంతో భూమిపై వినాశనం జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోపక్క 50 వేల ఏళ్ల సంవత్సరాల క్రితం భూమి దగ్గరకు వచ్చిన టైములో ఏమి జరగని నేపథ్యంలో ఇప్పుడు కూడా ఏమీ జరగదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని .. వస్తున్న వార్తలపై శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. వచ్చేవారమే ఈ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వస్తూ ఉండటంతో… ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ తోకచుక్క పచ్చ రంగులో కనిపించనుందని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. సరిగ్గా జనవరి 31 మంగళవారం ఉదయం 9:30 గంటల నుండి ఫిబ్రవరి మొదటి తారీకు రాత్రి 11 గంటల మధ్యలో… ఈ తోకచుక్క దృశ్యం ఆకాశంలో కనిపించనుంది.


Share

Related posts

మోనాల్ విషయమై యాంకర్ అడిగిన ప్రశ్న కు అఖిల్ ఫైర్… సీరియస్ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు

arun kanna

Beard: గడ్డం, మీసాలు పెరగడం లేదని చింతిస్తున్నారా..!? ఇలా చేస్తే వారం రోజుల్లో మీ గడ్డం పెరగడం ఖాయం..!!

bharani jella

బిగ్ బాస్ 4 : అరియానా ఛీ కొట్టింది కానీ దివి ముద్దుపెట్టింది..! అవినాష్ పిచ్చ లక్కీ

arun kanna