After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయకూడదు.. ఎందుకో తెలుసా..!?

Share

After Eating: మన ఆహారపు అలవాట్ల మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం ఎంత ముఖ్యమో.. ఆ ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా అంతే అవసరం..!! భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..!! అలా చేస్తే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..!! ఆ పనులేంటంటే..!?

After Eating: Don't Do These
After Eating: Don’t Do These

మనలో చాలా మంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దానికి తోడు గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు బాధిస్తాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే స్నానం చేయాలి. అదికూడా చల్లటి నీటితో స్నానం చేయాలి. వేడి నీటితో స్నానం చేయకూడదు. చన్నీటితో స్నానం చేయటం వలన ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అదే వేడినీటితో చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరిగి ఆహారం జీర్ణం కావడానికి ఇంకా ఆలస్యం అవుతుంది.

 

After Eating: Don't Do These
After Eating: Don’t Do These

మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత టీ, కాఫీలు రెండు గంటల తర్వాత మాత్రమే తాగాలని గుర్తుంచుకోండి. రాత్రి నిద్రకు ముందు టీ, కాఫీ తాగితే మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. భోజనం చేసిన వెంటనే నిద్రపోయే వారు చాలా మందే. భోజనం తరువాత కాసేపైన అటు ఇటు నడవమని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. భోజనం చేసిన తరువాత కనీసం అరగంట తర్వాత నిద్ర పోవాలి. అదే రెండు గంటల తర్వాత నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమై హాయిగా నిద్ర పడుతుంది.


Share

Related posts

అందరూ కలిసి పాపం నాని ని టార్గెట్ చేశారా…?

siddhu

కేటీఆర్ ప‌రువు గోవిందా… ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదేమో!

sridhar

జ‌గ‌న్ టీం ప్రయ‌త్నం… క‌రోనాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

sridhar