After Eating: అన్నం తిన్న వెంటనే స్నానం చేయొద్దని మన పెద్దవాళ్ళు ఇందుకే చెప్పారు.. ఇంత పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉందా..!!

Share

After Eating: కొంతమంది స్నానం చేస్తే కానీ అన్నం తినరు.. మరికొంతమంది భోజనం చేశాక స్నానం చేస్తారు.. స్నానం చేసిన తరువాత భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదా..!? లేదంటే నష్టమా..!? సైన్స్ ఏం చెబుతోంది..!? అధ్యయనాలు ఏమంటున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

After Eating: Shortly Going To Bath Is good for Health
After Eating: Shortly Going To Bath Is good for Health

After Eating: భోజనం చేసిన తర్వాత వేడి నీటితో స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..!!

పూర్వకాలం నుండి మన అమ్మమ్మలు, తాతయ్యలు భోజనం చేసిన తరువాత స్నానం చేయకూడదు అని హెచ్చరిస్తూనే ఉంటారు.. దీని వెనక మాల ఏదో అంతర్యం దాగి ఉంది అని వారు నమ్ముతారు.. ఒకవేళ స్నానం చేస్తే కడుపులో నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయని వారు చెబుతూ ఉంటారు.. భోజనం చేసిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఉన్న దానికంటే రెండు లేదా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని వలన శరీరంలో హైపర్ థెర్మిక్ చర్య ఏర్పడుతుంది. ఇది మీ రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. నాడీ వ్యవస్థకు విశ్రాంతి కలిగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. దీని ద్వారా ఆహారం జీర్ణం అవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది.  ఈ లోపు జీర్ణ సమస్యలు, ఛాతీలో మంట, తిమ్మిర్లు, గుండెలో మంట బాధ పెడతాయి.

After Eating: Shortly Going To Bath Is good for Health
After Eating: Shortly Going To Bath Is good for Health

After Eating: ఆహారం తీసుకున్నాక చల్లటి నీటితో స్నానం చేస్తే లాభమా..!!

భోజనం చేసిన తర్వాత చల్లటి నీటితో స్నానం చేయడం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది చల్లటి నీటితో స్నానం చేయడం వలన మీ కోర్ టెంపరేచర్ ఆధారపడదు.. ఇది మీ జీవక్రియను స్టార్ట్ చేస్తుంది. మీరు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా మీరు తీసుకున్న ఆహారం లో ఉన్న కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది. మీరు భోజనం తర్వాత వెంటనే స్నానం చేయాలి అనుకుంటే.. ముందుగానే స్నానం చేసి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. లేదు అంటే భోజనం చేసిన తర్వాత 2 గంటలు ఖచ్చితంగా ఆగాల్సిందే.. అది వేడి నీటితో స్నానం చేయాలన్నా లేదు చల్లటి నీళ్లతో స్నానం చేయాలన్న కూడా రెండు గంటలు వేచి ఉండక తప్పదు. ఈ లోపు ఆగకుండా చేస్తే పైన చెప్పుకున్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ఇదే నిరంతరాయంగా కొనసాగితే చాలా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం లేకపోలేదు.. భోజనం చేశాక స్నానం ఎప్పుడు చేయాలో తెలుసుకున్నారు కదా ఇప్పటి నచి ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే మీ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీరే పాడు చేసుకున్నట్టు అవుతుంది.


Share

Related posts

అనసూయ, రష్మీ ని టెన్షన్ పుట్టిస్తున్న ఆ యాంకర్..??

sekhar

బిగ్ బాస్ 4 : మా ఆయనే బిగ్ బాస్ టైటిల్ గెలిచేది అని అంటున్నారు..!!

sekhar

Gas Cylinder : మహిళలకు బంపర్ ఆఫర్.. కేవలం రూ 61 కే గ్యాస్ సిలిండర్ పొందండిలా..!!

bharani jella