NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Airports Selling; ఎయిర్ పోర్టులు అమ్మేద్దాం.. కేంద్రం కీలక నిర్ణయం..!!

Airports Selling; Central Cabinet Ready to Deal..

Airports Selling; దేశీయంగా అనేక రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్రానికి ఎయిర్ పోర్టులు కూడా ఆ దిశగా అప్పగించే సమయం వచ్చేసింది.. ప్రజాప్రయోజనాలున్న కీలక రంగాల్లో కార్పొరేట్ శక్తులను ఆహ్వానిస్తూ కేంద్రం కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఎయిర్ పోర్టులు అమ్మకానికి కూడా కేంద్రానికి సాకులు దొరికాయి. ఏడాదిన్నరగా కరోనా నేపథ్యంలో దేశీయంగా విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది.. ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ఎయిర్ పోర్టుల్లో కార్పొరేట్ కంపెనీలతో కలిసి నిర్వహణ వ్యవహారాలను చూస్తుంది. గత ఏడాది జనవరి నుండి కోవిడ్‌ వలన విమానయాన రంగానికి నష్టాలు రావడంతో కేంద్రం దీని నుండి తప్పుకోవాలనే యోచనలో ఉంది. ఆయా ఎయిర్‌ పోర్ట్‌లలో ఉన్న కేంద్ర వాటాలను అమ్మేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా తొలిదశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరులోని అంతర్జీతీయ విమానశ్రయాల్లోని తన వాటాల్ని అమ్మాలని నిర్ణయించింది.

Airports Selling; Central Cabinet Ready to Deal..
Airports Selling Central Cabinet Ready to Deal

Airports Selling; రూ. 35 వేల కోట్ల నష్టమని లెక్కలు..!

కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య దాదాపు 80 శాతం తగ్గిందని విమానయాన శాఖ లెక్కలు వేస్తుంది. ప్రయాణికులు తగ్గిపోవడం, ఇంధన ధరలు కొండెక్కి కూర్చోవడంతో దేశీయ విమానయాన సంస్థలకు భారీ నష్టం వాటిల‍్లినట్లు లెక్కలు వేస్తున్నారు. ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) రూ.9,500- రూ.10,000 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. గత ఏడాది జనవరి నుండి చూసుకుంటే కేంద్రానికి దాదాపు రూ. 35 వేల కోట్ల నష్టం వచ్చినట్టు లెక్కలు వేస్తున్నారు. దీని నుండి బయటపడాలంటే అమ్మకమే మార్గమని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఢిల్లీ, ముంబై ఎయిర్‌ పోర్ట్‌లలో 13శాతం వాటాను, హైదరాబాద్‌ – బెంగళూరుకు చెందిన ఎయిర్‌ పోర్ట్‌లలో మరో 13శాతం వాటాను అమ్మనుంది. దీనిపై ప్రాధమిక నిర్ణయం మంత్రమే వెల్లడయింది. ఇప్పటికే తమ వాటాల్ని అమ్మేందుకు అనుమతులు ఇవ్వాలని ఏవియేషన్‌ మినిస్ట్రీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనల్నిపంపింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే వాటాల అమ్మకం’ ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల మొదటి వారంలో జరగనున్న కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju