Akhanda: నందమూరి నట సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా అఖండ..!! ఏప్రిల్ 14న అఖండ టీజర్ ను టీజర్‌ను విడుదల చేశారు.. ఈ టీజర్ విడుదలైన రోజు నుంచి దుమ్మురేపుతోంది.. తాజాగా అఖండ టీజర్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి టీజర్ల ఖాతాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.. ఈ టీజర్ విడుదలైన 15 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్ ను సాధించడం మరో ప్రత్యేకత..!!
అఖండ టీజర్ 50 మిలియన్ వ్యూస్ తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ రాకెట్లా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఇంత వేగంగా వ్యూస్ రాబట్టుకోవడం ఏ టీజర్ కు సాధ్యపడలేదు.. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సాహో లాంటి భారీ చిత్రాల రికార్డులను అఖండ టీజర్ అలవోకగా దాటేయడం విశేషం.. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మే 28న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
??????? ?? ???????+ views in ????!
Thank you for this Record breaking response?#Akhanda title ???? ?
▶️ https://t.co/KYrviwAFCf#NandamuriBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation @WhackedOutMedia pic.twitter.com/WjyYa6O6Ds— Dwaraka Creations (@dwarakacreation) April 29, 2021