నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 4 రియాలిటీ షో టీఆర్పీలతో దూసుకుపోతుంది. ప్రతి ఎపిసోడ్ ఎంతో అద్బుతంగా హైలెట్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 4 షో లో టాస్కులు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయ్. అవి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయంటే.. ఈ వారం జరిగిన టాస్కు గురించి మరో మూడు వారాల తర్వాత కూడా గొడవపడేలా ఎపిసోడ్ నడుస్తుంది.
ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఒక టాస్క్ ప్రారంభం అయ్యింది. అదే బీబీ హోటల్. ఈ హోటల్ టాస్క్ లో అవినాష్ సీక్రెట్ టాస్క్ ప్లే చేస్తున్నాడు. అతడు మానేజ్మెంట్ టీమ్ లో ఉన్నప్పటికీ దాన్ని నాశనం చేసి బీబీ హోటల్ కి పేరు లేకుండా చేయాలి. అది బిగ్ బాస్ టాస్క్. ఇక అలానే అవినాష్ అన్ని నాశనం చేస్తూ.. అతనిపై డౌట్ రాకుండా సీక్రెట్ టాస్క్ ను చాలా సేఫ్ గా ప్లే చేస్తున్నాడు.
ఇక ఈ టాస్క్ లో యువ రాణిగా అరియనా ఉంది. ఆమె అవినాష్ ని ఫుల్ టార్గెట్ చేసి ఫుల్ ఆడుకుంటుంది. ఇక అలానే బకెట్, స్పూన్ ఇచ్చి స్విమ్మింగ్ ఫుల్ లో నీళ్లను స్పూన్ తో నింపాలని చెప్పడం, అవినాష్ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అంటూ గోల చేసి గంగవ్వతో తిట్టించింది అరియనా. ఇక ఆ సమయంలోనే అతను ఆమెను ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడు అంటూ ఆమె గోల గోల చెయ్యగా.. గొడవ ఆపడం కోసం సెక్యూరిటీగా ఉన్న అఖిల్ అవినాష్ ని కొట్టినట్టు నటించాడు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.