ట్రెండింగ్ న్యూస్ సినిమా

Alanti Sitralu : “అలాంటి సిత్రాలు” సినిమా టీజర్ వచ్చేసింది..!!

Share

Alanti Sitralu : నలుగురు భిన్న వ్యక్తుల విభిన్న జీవితాలు, అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం అలాంటి సిత్రాలు.. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు “అలాంటి సిత్రాలు” సినిమా టీజర్ ను విడుదల చేశారు..

Alanti Sitralu : movie teaser out
Alanti Sitralu : movie teaser out

Alanti Sitralu : టీజర్ డైలాగ్స్..!!

అయినా నీతో తిరిగితే తప్పేంటి.. నువ్వు ఒక ప్రాస్టిట్యూట్ అన్నావ్.. అది కూడా ఒక పనే గా అంటూ ఈ టీజర్ ప్రారంభమవుతుంది.. ఒకటి గుర్తు పెట్టుకో.. మనం నాశనం అవ్వాలంటే అన్నీ సహకరిస్తాయి.. కానీ బాగుపడాలంటేనే వంద అడ్డంకులు వస్తాయి.. అంటూ ఈ టీజర్ ముగుస్తుంది..

ఈ టీజర్ డైలాగులు విన్నాక నూతన దర్శకుడు సుప్రీత్ కృష్ణ మొదటి ప్రయత్నంలోనే మంచి కాన్సెప్ట్ తో వచ్చాడని అర్థం అవుతుంది. ఈ టీజర్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అభిమానుల్లో. ఈ సినిమా ను ఐ అండ్ ఐ ఆర్ట్స్ కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు రాఘవేంద్ర రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల చివరి లోపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

 


Share

Related posts

రూ.10లకు బిర్యాని అన్నాడు.. అరెస్ట్ అయ్యాడు!

Teja

శృంగారంలో మీకు ఇలాంటి సమస్య వస్తుందా? కారణం తెలుసుకోండి!! (పార్ట్-2 )

siddhu

ఓ రెడ్డి, ఇంకో చౌద‌రి…ఆమెపై 139 మంది అత్యాచారం?

sridhar