Allu Arjun: బోయపాటి… అల్లు అర్జున్ కాంబినేషన్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్..??

Share

Allu Arjun: తెలుగు సినిమా రంగంలో ఆడియన్స్ మాస్ పల్స్ తెలుసుకునే విషయంలో చాలా ఎక్స్పెక్ట్ డైరెక్టర్ బోయపాటి. బాలకృష్ణతో అనేకమంది హీరోలతో విజయాలు సాధించిన బోయపాటి అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్ లోనే “సరైనోడు” సినిమా అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ మాస్ హిట్. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ లో బన్నీ నటించిన సన్నివేశాలు.. గతంలో ఎన్నడూ లేని రీతిలో బోయపాటి చూపించడం జరిగింది. విలన్ కి తగ్గ రీతిలో బోయపాటి ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ చాలా హైలెట్ గా తీర్చిదిద్దారు. 

Allu Arjun and director Boyapati Srinu to team up again? | Telugu Movie News - Times of India

బన్నీ ఫిజిక్ కి తగ్గ రీతిలో ఫైట్లు కూడా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవటానికి సిద్ధంగా ఉంది. ఇటీవలె స్క్రిప్ట్ పనికి బోయపాటి వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు గతంలో బన్నీ ఎన్నడు ఎప్పుడు చెయ్యని ఓ క్యారెక్టర్ తో.. ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి బోయపాటి రెడీ అయినట్లు సమాచారం.

Read More: Allu arjun : అల్లు అర్జున్ వెనక స్టార్ డైరెక్టర్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ చేస్తారా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా అప్పట్లో సరైనోడు సినిమా నిర్మించిన నిర్మాతలతో పాటు గీతాఆర్ట్స్ బ్యానర్ కూడా నిర్మించడానికి రెడీ అయిందట. స్టోరీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో… పన్ని స్వయంగా తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ ని రంగంలోకి దింపినట్లు ఫిలిం నగర్ టాక్. ఇది మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో ఓ టాప్ డైరెక్టర్ సినిమాని కూడా బన్నీ లైన్ లో పడుతున్నట్లు దాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయాలనే ఆలోచనలో అండర్ గ్రౌండ్ లో డిస్కషన్లు జరుగుతున్నట్లు టాక్.  


Share

Related posts

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

Siva Prasad

తిరుమల వెళ్తున్నారా..!? ఈ బస్సు కచ్చితంగా ఎక్కాల్సిందే..! టీటీడీలో కొత్త బస్సులు

bharani jella

Today Horoscope నవంబర్ 15th ఆదివారం రాశి ఫలాలు

Sree matha