Allu Arjun Pushpa: “పుష్ప” రెండు పార్టులుగా రానుందా..!!

Share

Allu Arjun Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో రికార్డులను బద్దలు కొడుతుంది.. టాలీవుడ్ లోనే 60 మిలియన్ల వ్యూస్, 1.4 మిలియన్ల లైక్స్ సాధించిన మొట్టమొదటి టీజర్ గా రికార్డ్ సృష్టించింది.. తాజాగా పుష్ప సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది..

Allu Arjun Pushpa:movie has 2 parts
Allu Arjun Pushpa:movie has 2 parts

అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప రెండు భాగాలుగా రానుందని సమాచారం.. సుకుమార్ ఈ విషయమై బన్నీ సంప్రదించగా.. ఈ సినిమా గురించి సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత బన్నీ కూడా ఒప్పుకున్నారట. అల్లు అర్జున్ ఈ సినిమా రెండు పార్ట్స్ చేయమని సుకుమార్ కు తెలియజేశారట.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయింది.. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. పుష్ప మొదటి పార్ట్ ఈ సంవత్సరం థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పుష్ప పార్ట్ -2 ను 2022 లో విడుదల చేయనున్నారని తాజా సమాచారం.. ఈ విషయం తెలిసిన బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు..


Share

Related posts

Samantha: సమంతా కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్..??

sekhar

సారీ నేను కోలీవుడ్ లో చాలా బిజీగా ఉన్నాను ..అన్న రెజీనా ఆన్సర్ కి మైండ్ బద్దలయిందట ..?

GRK

`వాల్మీకి` రిలీజ్ డేట్

Siva Prasad