Green Peas: పచ్చి బఠాణీని రోజు తింటే ఏమవుతుందో తెలుసా..!?

Share

Green Peas: బఠాణీ అంటే టైం పాస్ కి తినే చిరుతిండి గానే అందరికీ తెలుసు.. వీటిలో ఆరోగ్యానికి కావలసిన పోషకలు ఉన్నాయి కొంతమందికే తెలుసు.. ముఖ్యంగా పచ్చిబఠాణి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. గ్రీన్ పీస్ ను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ప్రతిరోజు పచ్చి బటాని తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Amazing health benefits of Green Peas:
Amazing health benefits of Green Peas:

Green Peas: పచ్చి బఠానీలు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. ఈ బఠానీలతో జాగ్రత్తగా ఉండండి..!!

మన భారతదేశంలో బటాని పచ్చ రంగులో మాత్రమే లభిస్తుంది. అయితే విదేశాలలో మాత్రం వంకాయ, బంగారు రంగులో కూడా పచ్చి బటాని లభిస్తున్నాయి. మార్కెట్లో లభించే బఠానీలు అన్నీ నాణ్యమైనవి కావు. పచ్చి బఠానీలు అని నమ్మించడానికి వ్యాపారులు ఎండిన బఠాణీ లను నీటిలో నానబెట్టి వాటిని కలిపి ఆకుపచ్చ రంగులు కలిపి విక్రయిస్తున్నారు. అందుకని బఠానీలు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. బఠాణీలను ఉపయోగించే ముందు ఒకసారి నీటిలో లో వేసి ఐదు నిముషాలు నానబెట్టిన తర్వాత ఉపయోగించండి. ఒకవేళ ఆ బఠానీలు రంగు పోతుంటే నాలుగైదు సార్లు కడిగి ఆ తరువాత వాడుకోండి. ఇటువంటి తినటం వలన ఆరోగ్యానికి హాని కూడా కలుగుతుంది.

 

Amazing health benefits of Green Peas:
Amazing health benefits of Green Peas:

 

Green Peas: వంటకాల్లో దీని వినియోగం ఎక్కువే..!!

పచ్చి బటాని లో పోషక నిల్వలు ఉన్నాయని తెలియకుండానే చాలా మంది వీటిని అనేక రకాల కూరలతో కలిపి వండుకుని తింటున్నారు. వెజ్ బిర్యానీ లో కచ్చితంగా దీనిని ఉపయోగిస్తారు. ఆలూ, పన్నీర్, టమాటో, క్యాప్సికం, మటన్ ఇలా రకరకాల కూరలలో దీనిని ఉపయోగిస్తారు. పచ్చి బటాని తో తయారుచేసిన కట్లెట్ తింటానికి రుచికరంగా ఉంటుంది. బటాని సూప్ కూడా చాలామంది ఇష్టంగా తాగుతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఇవి అన్ని రకాల సీజన్లలో లభిస్తాయి. కాబట్టి ప్రతి సీజన్లో వీటిని తీసుకుంటూ ఉండాలి. ఆయా సీజన్లలో వచ్చే ఇన్ఫెక్షన్ శరీరం పోరాడడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Amazing health benefits of Green Peas:
Amazing health benefits of Green Peas:

పచ్చి బటాని లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటిచూపును మెరుగుపరిచే కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో ఉన్నాయి. పచ్చి బటాని లో కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థాలు ప్రొటీన్లు విటమిన్లు ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు వీటిని వారి డైట్ లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పచ్చి బటాని ప్రతి నిత్యం తీసుకోవడం శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. వీటిని తీసుకోవడం వలన మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వీటిని వారి డైట్ లో భాగం చేసుకోవాలి.


Share

Related posts

బ్రేకింగ్: పబ్జీ తరహా భారత గేమ్ ఫౌజీ

Vihari

Monal – Akhil : ఇన్ స్టా లో ఒక హాట్ హాట్ స్టోరీ పెట్టిన మొనల్ – మామూలు హాట్ కాదు రా బాబోయ్

bharani jella

అగ్రిగోల్డ్ పై  వైసీపీ ధర్నా

Siva Prasad