లాక్ డౌన్ దెబ్బకు చాలా రంగాల్లో ఉద్యోగాలు ఎగిరిపోయాయి. నిరుద్యోగ రేటు ఊహించని విధంగా భారీగా పెరిగిపోయింది. ఇక పనులు లేక చాలా కుటుంబాలు రోడ్డు మీద కూడా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దేశంలోని నిరుద్యోగులకి బంగారంలాంటి వార్తను వినిపించింది. అమెజాన్ ఇండియా వారు భారీగా తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి అని ప్రకటించడం గమనార్హం.
తాజాగా కస్టమర్ సర్వీస్ వింగ్ లో 20 వేల సీజనల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, నోయిడా, కలకత్తా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నో వంటి 11 నగరాల్లో ఉద్యోగులను నియమించనుట్లు తెలిపింది. కాబట్టి దేశంలో ఏ మూల అయినా అమెజాన్ సంస్థల్లో దీని ద్వారా ఉద్యోగం లభిస్తుంది.
ఉద్యోగాల్లో చాలా వరకు కస్టమర్ సర్వీస్ ప్రోగ్రాం లో భాగంగా ఉంటాయని పేర్కొంది. అంటే మనం ఏదైనా సందేహాల నివృత్తి కోసం కస్టమర్ కేర్ అధికారి తో చాట్ చేయడం లేదా వారితో టెలిఫోన్ లో సంభాషించడం వంటి కార్యకలాపాల కు కావలసిన ఉద్యోగుల భర్తీకి అమెజాన్ ఇప్పుడు ప్రక్రియను మొదలు పెట్టింది అన్నమాట.
లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్ షాపింగ్ బటనే చాలామంది అనుసరిస్తున్నారు. చాలాచోట్ల బయటికి వెళ్లి జనాల మధ్య తిరిగి షాపుల్లో వస్తువులు కొనుక్కునే వెసులుబాటు లేకపోవడం మరియు కరోనా రిస్క్ ఎక్కువ కావడంతో ఆన్లైన్లో కొనుగోళ్ళ శాతం భారీగా పెరిగింది. దీనితో అమెజాన్ వారికి ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది ఇది ఇప్పుడు అందరికీ భారీ వరంగా మారింది.
ఇకపోతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 12వ తరగతి చదివి ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నైపుణ్యం ఉన్నవారు అర్హులు అని వివరించింది. అంతేకాకుండా పైన చెప్పిన భాషలు అన్ని రావాల్సిన అవసరం లేదు… వాటిలో ఒకటి రెండు వచ్చినా చాలట. అయితే ఉద్యోగాలన్నీ కూడా సీజనల్ జాబ్స్ కావడంతో వారిని తాత్కాలిక ఉద్యోగులు గా పరిగణిస్తారు. అయితే వారి పర్ఫామెన్స్ ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వారిని శాశ్వత ఉద్యోగులుగా కూడా తీసుకుంటామని అమెజాన్ పేర్కొంది. ఆసక్తిగల అభ్యర్థులు 1800-208-9900 కి ఫోన్ చేయవచ్చని చెప్పారు. ఆలగే [email protected] కి కూడా మెయిల్ చేయవచ్చు.