NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే త్వరపడండి.. 5 రూపాయలకే బంగారం కొనుక్కునే గోల్డెన్ చాన్స్

Amazon pay launches digital gold feature for Indian users

ఈ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ చేయాలన్నా.. కొత్త కొత్త సినిమాలు చూడాలన్నా… డిజిటల్ వాలెట్ ద్వారా డబ్బులు చెల్లించాలన్నా.. అన్నింటిలోనూ అమెజాన్ దే హవా. అటు అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాంతో పాటు అమెజాన్ ప్రైమ్, అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ పే.. అంటూ ఎన్నోరకాల సేవలను మనముందుకు తీసుకొచ్చింది.

Amazon pay launches digital gold feature for Indian users
Amazon pay launches digital gold feature for Indian users

తాజాగా అమెజాన్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్ ను తీసుకొచ్చింది. అమెజాన్ అకౌంట్ ఉంటే చాలు.. అమెజాన్ పే ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

అమెజాన్ పే ప్రారంభించిన ఈ సర్వీస్ ద్వారా 5 రూపాయలు పెట్టి కూడా బంగారం కొనుక్కోవచ్చు. డిజిటల్ గోల్డ్ సర్వీస్ కోసం అమెజాన్.. సేఫ్ గోల్డ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. అనంతరం అమెజాన్ పేలో గోల్డ్ వాల్ట్ పేరుతో డిజిటల్ గోల్డ్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీసం 5 రూపాయలు పెట్టి కూడా గోల్డ్ కొనుక్కునేలా ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు.

ఇప్పటికే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, మొబిక్విక్ లాంటి డిజిటల్ వాలెట్స్ డిజిటల్ గోల్డ్ సర్వీసును అందిస్తున్నాయి. కాకపోతే.. అమెజాన్ పేలో డిజిటల్ గోల్డ్ ఫీచర్స్ మరింత సులువుగా ఉంటాయని.. యూజర్లకు అనుకూలంగా ఫీచర్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది.

ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ కు ఆదరణ బాగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ లోనే కాకుండా అక్షయ తృతీయ లాంటి పండుగల సమయంలో డిజిటల్ గోల్డ్ ను కిలోలకు కిలోలు కొంటున్నారట. గత అక్షయ తృతీయ రోజు పేటీఎం ఏకంగా 37 కిలోల డిజిటల్ గోల్డ్ ను అమ్మిందట. ఫోన్ పే అయితే ఏకంగా 100 కిలోలు అమ్మిందట. వామ్మో.. జనాలు ఫిజికల్ గోల్డ్ ను వదిలేసి… డిజిటల్ గోల్డ్ మీద పడ్డట్టున్నారుగా ఇక. అందుకే.. డిజిటల్ వాలెట్స్ అన్నీ డిజిటల్ గోల్డ్ ఫీచర్ మీద ఆసక్తి చూపిస్తున్నాయి.

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju