ఉసిరి కాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించే ఉసిరికాయతో ఎన్నో లాభాలు ఉన్నాయ్. మరి అలాంటి ఉసిరికాయను డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఈ ఉసిరికాయతో ఏ వంటలు చేయచ్చు అనేది మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.
సలాడ్స్ లో నిమ్మరసం బదులు ఉసిరికాయ రసం తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక ఇది ఎంతో శక్తిని కూడా ఇస్తుంది.
ఉసిరికాయ పప్పు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉసిరికాయను నీటిలో మరిగించి తీసుకుంటే పుల్లని రుచి పోయ్ ఎంతో రుచిని ఇస్తుంది. ఇక ఆలా చేసుకొని తినడం వల్ల ఉసిరికాయ రుచితో పాటు న్యూట్రిటివ్ వ్యాల్యూ పెరుగుతుంది.
హెర్బల్ టీ లో ఉసిరికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి హెర్బల్ టీ డికాషన్ లో కలిపి తాగితే చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఇమ్యూనిటీని పెంచుకోవడానికే కాక జలుబు, దగ్గుకి ఉసిరి కాయ జ్యుస్ బాగా పని చేస్తుంది. ఇంకా ఉసిరి రసంలో కొంచెం తేనె తీసుకుంటే డీసీజెస్ మన దగ్గరకు రావు. ఉసిరికాయతో చట్నీ చేసుకున్న ఎంతో రుచిగా ఉంటుంది.
ఉసిరిలో విటమిన్ ‘సి ‘ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. రెసిస్టెన్స్ కూడ పెరుగుతుంది.
ఉసిరికాయలో ఉండే లాక్స్ టివ్ ప్రాపర్టీస్ వలన మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.
ఉసిరికాయను క్రమంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ ని అదుపు చేస్తుందని కొన్ని స్టడీస్ లో తెలుస్తోంది.
చూశారుగా ఉసిరికాయ ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో మరి ఇంకేందుకు ఆలస్య.. ఉసిరికాయ కనిపిస్తే ఎంతైనా సరే కోనేయండి.