హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నా గాని.. టిఆర్పి రేటింగ్ విషయంలో ఊహించని రీతిలో రికార్డులు సాధిస్తూ, ప్రేక్షక ఆదరణ దక్కించుకుంటుంది బిగ్బాస్ సీజన్ 4. కాగా హౌస్ లో ఇటీవల బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లో హారిక జుట్టు కత్తిరించు కోగా, కుమార్ సాయి బట్టలు కత్తిరించుకోవడం జరిగింది.
అంతేకాకుండా ఒక బస్తాను ఒక చేతితో తాడు పట్టుకుని చాలాసేపు కుమార్ సాయి నిలబడటంతో…. నొప్పి తట్టుకోలేక గట్టిగా, గట్టిగా హౌస్ లో అరవడం వంటి కఠినమైన టాస్క్ జరిగింది. ఈ విధంగా భయంకరమైన టాస్క్ ఇస్తున్న బిగ్బాస్ తాజాగా.. అరగుండు టాస్క్ ఇవ్వటంతో, ఈ తరుణంలో బెల్ ముందుగా అఖిల్ కొట్టడంతో… ఈ టాస్క్ కి అమ్మరాజశేఖర్ రెడీ అయినట్లు ప్రోమో బట్టి తెలుస్తుంది. హౌస్ లో ఇప్పటి వరకు తన స్టెప్ లతో వంటలతో అలరించిన తరుణంలో ఈ అరగుండు టాస్క్ ఒప్పుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
మరి అరగుండు లో అమ్మ రాజశేఖర్… ఎలా కనిపిస్తారు అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏదిఏమైనా ఆరో వారం లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.