బిగ్ బాస్ సీజన్ 4 టాస్క్ నిన్న 31వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. బీబీ హోటల్ టాస్క్ ముగిసిన వెంటనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారిని కెప్టెన్సీ టాస్కులో విజేత నిల్చోబెట్టగా చెత్త పర్ఫార్మర్ గా అమ్మ రాజశేఖర్ నిలిచాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నప్పటి నుంచి వింతగా పెర్ఫార్మ్ చేస్తున్న అమ్మ రాజశేఖర్ బీబీ హోటల్ టాస్క్ లో కూడా చాలా వింతగా అతిగా బెహేవ్ చేశారు.
ఎవరి మాట అతనికి పట్టనట్టు వ్యవహరించాడు. చిన్న నెగటివిటి కూడా తట్టుకోలేని అమ్మ రాజశేఖర్ నామినేషన్స్ లోకి వెళ్లడం.. కెప్టెన్సీ లో లేకుండా స్వాతి దీక్షీత్ బిగ్ బాంబ్ వెయ్యడం వల్ల కెప్టెన్సీ లేకపోవడం అమ్మ రాజశేఖర్ ని బాగా బాధపెట్టాయ్. ఇక ఆ భాద ఒకటి ఉండగా టిప్ కోసం స్విమ్మింగ్ ఫుల్ లో దూకడంతో అమ్మ రాజశేఖర్ బాగా ఫ్రస్టేషన్ లో ఉన్నాడు. దీంతో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియకపోయే.
దీంతో టాస్క్ ఆడుతున్న సమయంలో కెప్టెన్సీకి అభిజిత్ కి సాయం చేస్తా అని చెప్పిన అయన చివరికి రివర్స్ అవ్వడం.. అమ్మ రాజశేఖర్ అతిగా మాట్లాడటం వంటివి చేశారు. అయన అంతటితో ఆగలేదు.. మేనేజర్ చెప్పినట్టు వినకపోవడం వంటివి చేసిన అమ్మ రాజశేఖర్ అతనే సరిగ్గా ఆడలేదని.. బిబీ హోటల్ టాస్క్‌లో చెత్త ఫెర్ఫార్మర్‌గా నించున్నాడు.
మిగితా వారు అంత కూడా చెత్త ఫెర్ఫార్మర్‌గా ఒప్పుకోకపోవడంతో అమ్మ రాజశేఖర్ ఏ చెత్త ఫెర్ఫార్మర్‌గా ఎంపికయ్యాడు. దీంతో బుట్టలో ఉల్లిగడ్డలను తెప్పించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంటికి పంపాలని శిక్ష వేశాడు. ఇక చేసేది ఏమి లేక సైలెంట్ గా బిగ్ బాస్ చెప్పినట్టు ఉల్లిగడ్డలు కట్ చేసి పంపించాడు అమ్మ రాజశేఖర్.