24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Ananth Ambani: అంబానీ ఇంట పెళ్లి సందడి.. హాజరైన సినీ తారలు..

Ananth Ambani Radhika merchant engagement attend Bollywood celebrities
Share

Ananth Ambani: భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ముకేశ్‌, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ముంబయిలోని అంబానీ ఇంటి వద్ద గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు.. ఈ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు..

Ananth Ambani Radhika merchant engagement attend Bollywood celebrities
Ananth Ambani Radhika merchant engagement attend Bollywood celebrities

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థ పార్టీలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహరియాతో కలిసి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే బీ టౌన్ నుంచి బాద్‌షా షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ఐశ్వర్య, అభిషేక్‌ బచ్చన్‌, జహీర్‌ఖాన్‌, సాగరిక పలువురు హాజరై సందడి చేశారు.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Ananth Ambani Radhika merchant engagement attend Bollywood celebrities
Ananth Ambani Radhika merchant engagement attend Bollywood celebrities

అనంత్‌ అంబానీ నిశ్చితార్థం రాధిక మర్చంట్‌తో రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగింది. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సీఈఓ విరెన్‌ మర్చంట్‌ శైలజా మర్చంట్‌ల కూతురే రాధిక మర్చంట్‌.. ఇరు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనంత్‌ , రాధికా చాలా ఏళ్లుగా ప్రేమించుకుని త్వరలో వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు..

Share

Related posts

Muscle Cramps: పైసా ఖర్చు లేకుండా పిక్క, తొడ కండరాల నొప్పులు తగ్గించుకోండి..! 

bharani jella

విడుద‌ల‌కు ఊసే లేని సినిమా

Siva Prasad

Prabhas: ప్రభాస్ సినిమా విషయంలో మళ్ళి అదే తప్పు రిపీట్ చేస్తున్న నిర్మాతలు..తల పట్టుకుంటున్న అభిమానులు..??

sekhar