ఆహా అనసూయ కేక: ఆమెలాంటి భార్య ఉండడం నిజంగా అదృష్టం – భర్తకోసం ఏం చేసిందో చూడండి!

అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన మాట తీరుతో ఎన్నో షోలకు ప్రముఖ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ, ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అక్కినేని మన్మధుడుతో సోగ్గాడే చిన్ని నాయనా అంటూ స్టెప్పులేసి, రంగస్థలంలో రంగమ్మత్తగా ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

 

ఇక అనసూయ వ్యక్తిగత జీవితానికి వస్తే.. సుశాంక్ భరద్వాజ్ ను అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అనసూయ ప్రారంభంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. తన జీవితంలో ఎన్నో బాధలను ఎదుర్కొన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ సమయంలో తన భర్త, బంధువులు ఎంతో సపోర్ట్ చేశారని అనసూయ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు.

అనసూయ తన మీద వచ్చే రూమర్స్, కామెంట్స్ అన్ని తట్టుకుని తన జీవితంలో ముందుకు వెళ్తుందని భరద్వాజ్ కూడా చెప్పారు. ఇక తనేంటో నాకు బాగా తెలుసు అని భరద్వాజ్ కూడా ఎన్నో సార్లు చెప్పాడు. ఇకపోతే అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆదివారం తన భర్త పిల్లలతో పాటు చుట్టుపక్కలవారితో క్రికెట్ ఆడుతూ తీసిన వీడియో అనసూయ షేర్ చెయ్యగా ఆ వీడియోలో ఆమె తన భర్తను ఎంకరేజ్ చేస్తూ, సండే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా సమయాన్ని గడిపింది.