Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ షో దాదాపు చివరి దశకు చేరుకుంది. 17 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా మధ్యలో మరికొంతమంది యాడ్ కాగా షో చాలా రసవత్తరంగా సాగుతూ వస్తోంది. ఈ క్రమంలో గత వీకెండ్ ఎపిసోడ్ లో అరియానా కి దేవి నాగవల్లి హింట్ ఇచ్చినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే షో చివరి దశకు చేరుకున్న తరుణంలో మాజీ బిగ్ బాస్ సీజన్ సభ్యులను గత ఆదివారం అతిథులుగా రావడం తెలిసిందే. ఇదే సమయంలో కుటుంబ సభ్యులను కూడా నాగార్జున స్టేజిపైకి పిలిచారు. దీనిలో భాగంగా అరియానా కోసం దేవి నాగవల్లి అదేవిధంగా బయట ఫ్రెండ్ .. ఇద్దరు వచ్చారు.
కాసేపు వేదికపై ముచ్చటించారు. యధావిధిగా సీజన్ ఫోర్ లో మాదిరిగానే అరియానాకి దేవి నాగవల్లి మంచి మద్దతు ఇవ్వటం మాత్రం కాదు ఎనర్జీ ఇచ్చే మాటలు కొటేషన్స్ చెప్పటం జరిగింది. అయితే వేదిక పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న సభ్యుల టాప్ ఫైవ్ లిస్ట్ పెట్టాలని కండిషన్ ఉండటంతో…అరియానా ఫ్రెండ్ మృగనయిని టాప్ ఫైవ్ ఆర్డర్ టాప్ – 1లో అరియానా, 2లో బిందుమాధవి, అలాగే టాప్ 3 లో శివ, 4లో అఖిల్ , లాస్ట్ లో నటరాజ్ మాస్టర్ లని పెట్టడం జరిగింది.
అదే సమయంలో పక్కనే ఉన్న దేవి నాగవల్లి నాగార్జున నాని పర్మిషన్ అడిగి ఆర్డర్ మార్చవచ్చా.. అంటూ అరియానా మొదటి స్థానం నుండి తీసేసి బిందుమాధవి ఫస్ట్ ప్లేస్ లో.. సెకండ్ పొజిషన్లో అఖిల్..నీ పెట్టడం జరిగింది. అరియానా కి నాలుగో స్థానం ఇవ్వటం జరిగింది. దీంతో బయట ఉన్న క్యాలిక్యులేషన్ ల ప్రకారం బిందుమాధవి.. రేసులో అందరికంటే ముందు ఉందని.. దేవి నాగవల్లి హింట్ ఇచ్చినట్లయింది. ఈ దెబ్బతో అరియానా ప్రస్తుతం హౌస్ లో గేమ్ చాలా వరకు మార్చినట్లు కనిపిస్తోంది.