Anchor Lasya: యాంకర్ లాస్య తెలియని వారు ఎవరు ఉండరు. తెలుగు టెలివిజన్ రంగంలో చాలా షో లలో యాంకర్ గా లాస్య మంచి పేరు, క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. మాటీవీలో యాంకర్ రవితో లాస్య చేసిన షో బాగా పాపులర్ కావడంతో మీరిద్దరూ యాంకరింగ్ పరంగా ఇండస్ట్రీలో తమకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు ఎవరికి వారు రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే సీజన్ 4 లో లాస్య బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రావడం జరిగింది. తర్వాత మళ్లీ కెరియర్ పరంగా బిజీగా ఉంటున్నా లాస్య ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో జాయిన్ అయింది.
Bigg Boss 6: ఈసారి సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల విషయంలో చిన్న మార్పు..??
ఈ విషయాన్ని స్వయంగా లాస్య భర్త మంజునాథ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. గెట్ వెల్ సున్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. హాస్పిటల్ బెడ్ పై లాస్య పడుకున్న ఫోటో మరియు కొద్దిపాటి వీడియోను .. ఇన్ స్టా స్టోరీలో పెట్టడంతో లాస్య అభిమానులు కంగారు పడుతున్నారు. లాస్య గురించి ఎప్పుడూ కూడా పెద్దగా ఇటువంటి పోస్ట్ లు భర్త మంజునాథ్ గతంలో పెట్టిన సందర్భాలు లేవు. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇద్దరు కూడా చాలా ప్రేవేసిగా ఉంటారు.
Bigg Boss 6: ఈసారి సీజన్ సిక్స్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల విషయంలో చిన్న మార్పు..??
అటువంటిది ఒక్కసారిగా లాస్య ఆసుపత్రి బెడ్ పై పడుకున్న ఫోటో భర్త మంజునాథ్ పెట్టడం సంచలనంగా మారింది లాస్యకి ఏమైంది అని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుపుకుంటున్నారు. లాస్య హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయింది అనే దానిపై క్లారిటీ లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలని నేటిజెన్లు లాస్య అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా భగవంతుని కోరుకుంటున్నారు.