Bigg Boss 6 Telugu: ఐదో సీజన్ ముగిసిన వెంటనే వారం రోజులు కాకముందే నెక్స్ట్ సీజన్ మరో రెండు నెలలో స్టార్ట్ అవుతున్నట్లు షో నిర్వాహకులు చెప్పడం..తో.. ఈసారి హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు అన్నది ఉత్కంఠభరితంగా మారింది. ఓటిటి లో 24 గంటలు చూపించడంతో పాటు “మాటీవీ”లో గంట ఏపిసోడ్ యధావిధిగా… ప్రసారం కానున్న తరుణంలో … సోషల్ మీడియా పరంగా ఇండస్ట్రీ పరంగా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ నేను హౌస్ లోకి కంటెస్టెంట్ లాగా పంపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో టెలివిజన్ రంగంలో వెరైటీ షోలతో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న ఓంకార్.. ఓటిటీ బిగ్ బాస్ లోకి… ఎవరిని పంపించాలి అనే దాని విషయంలో బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటిటి కావటంతో ఇష్టానుసారంగా మాట్లాడుకునే అవకాశం ఉండటంతో… సోషల్ మీడియాలో పేరుగాంచిన యూట్యూబ్ ఛానల్ లకి… ఇంటర్వ్యూ ఇస్తూ సరికొత్త విమర్శలు చేస్తూ ఇండస్ట్రీలో… కొరియోగ్రాఫర్ గా తనకంటూ గుర్తింపు దక్కించుకున్న రాకేష్ మాస్టర్ నీ… సీజన్ సిక్స్ బిగ్ బాస్ లోకి తీసుకోవాలని … ఓంకార్ ఉర మాస్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల పై అదే రోజుల్లో రాజకీయంగా ఉండేది ప్రధాన నాయకులపై రాకేష్ మాస్టర్ పలు ఇంటర్వ్యూలలో వైరల్ కామెంట్లు చేయడం…ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. దీంతో ఇటువంటి స్వభావం కలిగిన వ్యక్తి..ఓటిటి బిగ్ బాస్ లోకి… పంపిస్తే తిరుగుండదని.. ఓంకార్.. రాకేష్ మాస్టర్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాట్లు లేటెస్ట్ టాక్. మరోపక్క రాకేష్ మాస్టర్ ఇటీవలె సీజన్ ఫైవ్ మాదిరిగా… బయట సోషల్ మీడియాలో గుర్తింపు కలిగిన చిన్నచిన్న నటీనటులను హౌస్ లో పెట్టి… “డుప్ బిగ్ బాస్” చేయడం జరిగింది. ఈ షో బాగా వైరల్ అయింది …దీంతో రాకేష్ మాస్టర్ ని హౌస్ లోకి.. పంపించాలని షో.. నిర్వాహకులు మరియు ఓంకార్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.